ఆంధ్రప్రదేశ్‌

బడ్జెట్‌లో అంకెల గారడీపై కాగ్ దర్యాప్తు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి అధికార టిడిపి ప్రభుత్వం అసెంబ్లీని తప్పుదోవపట్టించే విధంగా అంకెలు తారుమారు చేసి సరైన సమాచారం ఇవ్వలేదని, ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, కాగ్ దర్యాప్తు చేయాలని వైకాపా శాసనసభాపక్ష ఉపనేత మేకపాటి గౌతం రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, 2014-15 సంవత్సరానికి అకౌంట్స్ వివరాలను ప్రభుత్వం ఎందుకు అందించలేదన్నారు. ఆ ఏడాది రాష్ట్రప్రభుత్వం రూ.24194 కోట్ల రెవెన్యూ లోటును ఎందుకు ఎదుర్కొన్నదని ప్రశ్నించారు. అంతకు ముందు ఎనిమిది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిగులు రెవెన్యూ సాధించిందన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం 3 శాతానికి మాత్రమే పరిమితమైతే ఆర్థిక లోటు 6.1 శాతం వరకు జిఎస్‌డిపిలో నమోదు చేశారన్నారు. 6.1 శాతం వరకు జిఎస్‌డిపిలో ఆర్థిక లోటు ఉండే విధంగా కేంద్రం అనుమతి ఇచ్చిందా అని ప్రశ్నించారు. 2014-15లో రాష్ట్రప్రభుత్వం 22 వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లను ఇతర కార్యక్రమాలకు ఖర్చుపెట్టిందనే అనుమానం వ్యక్తం చేశారు. కొత్తగా నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రూ.16,200 కోట్ల రెవెన్యూ లోటు ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో తెలిపారన్నారు. కాగ్ నివేదికను చూస్తే ఆంధ్రా రెవెన్యూ 65695 కోట్ల వరకు ఉందన్నారు. 2015-16, 2016-17కు కూడా జిఎస్‌డిపి అంచనాలపై తామడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని, జవాబుదారీతనంతో చంద్రబాబు ప్రభుత్వం మెలగాలని ఆయన డిమాండ్ చేశారు.