S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/22/2016 - 08:14

హైదరాబాద్, ఏప్రిల్ 21: జగన్ అక్రమాస్తుల కేసులో ఐఆర్‌ఎస్ అధికారి కెవి బ్రహ్మానందరెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై వచ్చే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు జడ్జి జస్టిస్ రాజా ఎలాంగో జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో వాన్‌పిక్‌కు రాయితీపై భూములు కేటాయించడంపై జరిగిన ఎంఓయూలో ఈ అధికారి కీలకపాత్ర వహించారంటూ సిబిఐ అభియోగం మోపింది.

04/22/2016 - 08:18

ధర్మవరం, ఏప్రిల్ 21: ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిరుపేదలకు సామూహిక వివాహాలు జరిపించే విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలోని తిరుమల దేవర ఆలయంలో గురువారం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

04/22/2016 - 08:08

కడప, ఏప్రిల్ 21: రాజకీయ స్వలాభం కోసం అడ్డదిడ్డంగా రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అధోగతి పాలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నేడు అధికారంలోకి వచ్చినందున విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కడపలో గురువారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు.

04/22/2016 - 08:07

కాకినాడ, ఏప్రిల్ 21: అభివృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2015-16 సంవత్సరానికి దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 10.9 శాతం అభివృద్ధి రేటు సాధించడంతో, డబుల్ డిజిట్ సాధించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కల సాకారం అయ్యిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

04/22/2016 - 08:06

ఒంగోలు, ఏప్రిల్ 21: రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరితోపాటు రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరాపానందేంద్ర స్వామి వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని హరిహరక్షేత్రం పదవ వార్షికోత్సవం సందర్భంగా స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులనుద్దేశించి అభిభాషణ చేశారు.

04/22/2016 - 08:06

సంతమాగులూరు, ఏప్రిల్ 21: నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం కెఎంసి అతిథిగృహంలో గురువారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాలవారీగా కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని సమీక్ష నిర్వహించారు.

04/21/2016 - 18:04

చిత్తూరు: బట్టలు ఉతికేందుకు వెళ్లిన భార్య బావిలో పడగా ఆమెను రక్షించేందుకు వెళ్లిన భర్త కూడా నీట మునిగి మరణించిన సంఘటన పుంగనూరు మండలం వేపమాకులపల్లెలో గురువారం జరిగింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన మణెమ్మ ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన భర్త గంగులప్ప కూడా కాలుజారి బావిలో పడ్డాడు. దంపతుల మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.

04/21/2016 - 18:03

హైదరాబాద్: అసెంబ్లీలో తన ప్రవర్తనకు సంబంధించి క్షమాపణ చెప్పాలంటూ సుప్రీం కోర్టు సూచించలేదని కేవలం వివరణ మాత్రమే అడిగిందని నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా గురువారం తెలిపారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినందుకే అధికార పార్టీ వారు తనను టార్గెట్ చేశారని, సిఎం చంద్రబాబుతో తనకు ఎలాంటి గొడవులు లేవన్నారు.

04/21/2016 - 16:47

కడప: పులివెందులలో రెండు రోజుల క్రితం ఎస్‌బిఐ ఎటిఎంల్లో నగదు పెట్టడానికి వెళుతున్న సిబ్బందిపై ఇనుపరాడ్లతో దాడి చేసి 53 లక్షల రూపాయలను దోచుకున్న ఘటనలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలతో పాటు నలుగురు స్థానిక దొంగలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి 53 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

04/21/2016 - 16:47

దిల్లీ: ఎపీ శాసనసభలో తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణ చెబుతూ స్పీకర్‌కు రేపటిలోగా లేఖ రాయాలని వైకాపా ఎమ్మెల్యే రోజాకు సుప్రీం కోర్టు గురువారం సూచన చేసింది. అసెంబ్లీ నుంచి తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం అన్యాయమని రోజా వేసిన పిటిషన్‌పై కోర్టు విచారించిన అనంతరం ఈ సూచన చేసింది. ఎపి ప్రభుత్వం తరఫున, రోజా తరఫున హాజరైన లాయర్లు వారి వాదనలు వినిపించారు.

Pages