S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/24/2016 - 07:38

దర్శి, ఏప్రిల్ 23 : దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం సహకారంతో దర్శి నియోజకవర్గంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. శనివారం డ్రైవింగ్ శిక్షణా కేంద్రం స్థలాన్ని మంత్రి శిద్దా పరిశీలించారు.

04/24/2016 - 07:37

ముత్తుకూరు, ఏప్రిల్ 23: నెల్లూరు జిల్లా మండలంలోని దామోదరం సంజీవయ్య ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు రవాణా కేంద్రం వద్ద విరిగిన సంఘటన కోల్‌స్టాకర్ రీక్లైమర్ ప్రమాదం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎపి జెన్‌కో ఇంజనీర్ల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

04/24/2016 - 07:37

మచిలీపట్నం, ఏప్రిల్ 23: జూన్ 16 నాటికి రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో నూరు శాతం ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మచిలీపట్నం పురపాలక సంఘానికి శనివారం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో 5లక్షల 50వేల ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.

04/24/2016 - 07:36

గుంటూరు, ఏప్రిల్ 23: కేంద్రప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయటంలేదని మరోవైపు బిజెపిపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఆక్షేపించారు. గుంటూరు జిల్లా పార్టీ మహాసభలో పురంధ్రీశ్వరి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

04/24/2016 - 07:34

కర్నూలు సిటీ, ఏప్రిల్ 23: ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు శనివారం కర్నూలు నగరంలోని టిడిపి కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి, పార్లమెంట్ ఆమోదం కోసం డిల్లీకి పంపుతామని హామీ ఇచ్చా మోసం చేశారని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు ధ్వజమెత్తారు.

04/23/2016 - 18:10

విజయవాడ: ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుతో చీఫ్‌ సెక్రటరీ టక్కర్ భేటీ అయ్యారు. వచ్చే సమావేశాలు ఏపీలో నిర్వహించనున్న నేపథ్యంలో శాసనసభ భవనం పనులను వేగవంతం చేయాలని స్పీకర్‌ సూచించారు.

04/23/2016 - 17:58

విశాఖపట్నం: కొబ్బరితోట పార్కు స్థలంలో వెలసిన రైతుబజార్‌లోని దుకాణాలను తొలగించడానికి జీవీఎంసీ అధికారులు ప్రయత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తే వెళతామని, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామని వ్యాపారులు అధికారులను హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున పోలీసులు మొహరించారు.

04/23/2016 - 17:56

విజయవాడ: జగన్ తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే వైసీపీ అంతా ఖాళీ అవుతుందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆయన నియంతృత్వ వైఖరిని భరించలేకనే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు. జగన్‌కు ప్రజా సమస్యలు పట్టవని, నిత్యం డబ్బుమీదే ద్యాస ఉంటుందని విమర్శించారు. ప్రజా సమస్యలను శాసనసభలో ఏనాడూ జగన్ ప్రస్తావించలేదని ఆరోపించారు.

04/23/2016 - 17:44

ఒంగోలు: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైకాపాకు రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. ఆయన త్వరలోనే టిడిపిలో చేరే అవకాశాలున్నాయని సమాచారం. సంతమాగలూరులో ఆయన మూడు మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, ముఖ్యనేతలతో శనివారం సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

04/23/2016 - 17:43

ఏలూరు: ఎపి సిఎం చంద్రబాబు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా చెరువుల్లో పూడికతీత పనులను పరిశీలించారు. పెదవేగి మండలం ముండూరులో చెరువును పరిశీలించిన అనంతరం రోడ్డును ప్రారంభించారు. పోలవరం కుడికాల్వపై నిర్మిస్తున్న అక్విడక్ట్ పనులను చూసి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను హెలికాప్టర్ ద్వారా వీక్షించారు.

Pages