ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షణ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, ఏప్రిల్ 23 : దేశవ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం సహకారంతో దర్శి నియోజకవర్గంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. శనివారం డ్రైవింగ్ శిక్షణా కేంద్రం స్థలాన్ని మంత్రి శిద్దా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ ఈనెల 25న ఉదయం 11.30 గంటలకు శిక్షణా కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఐసిడిఆర్ నిధులు 19 కోట్లు శిక్షణా కేంద్రానికి మంజూరు అయినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ శిక్షణా కేంద్రాన్ని దర్శి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణా కేంద్రంలో డ్రైవింగ్‌లో అన్నీ రకాల మెలకువలు నేర్పించి డ్రైవింగ్ లైసెన్సు అందజేస్తారన్నారు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. అన్ని వాహనాలు జిపిఎస్ సౌకర్యం, స్పీడు గవర్నర్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో వాహనం అనుసంధానం చేసి ఏ వాహనం ఎక్కడప్రయాణిస్తుంది, ఎంత వేగంతో ప్రయాణిస్తుందో కూడా గుర్తించవచ్చన్నారు.