ఆంధ్రప్రదేశ్‌

అన్ని మున్సిపాల్టీల్లో జూన్ నాటికి ఎల్‌ఇడి బల్బులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 23: జూన్ 16 నాటికి రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో నూరు శాతం ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. మచిలీపట్నం పురపాలక సంఘానికి శనివారం వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో 5లక్షల 50వేల ఎల్‌ఇడి లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇప్పటికే 2లక్షల 50వేల ఎల్‌ఇడి లైట్లు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 3.50 లక్షల లైట్లను జూన్ 16 నాటికి పూర్తిచేసి తిరుపతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్‌ఇడి దీపాల వల్ల 50 శాతం విద్యుత్‌ను ఆదా చేయటంతో పాటు ఏడేళ్ల వరకు ఎలాంటి నిర్వహణ చార్జీలు మున్సిపాల్టీలపై పడవన్నారు. అలాగే పురపాలక సంఘాల నుంచి భారీగా వస్తున్న వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టుగా త్వరలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 200 టన్నుల చెత్త ఉంటే దానిద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు తర్వాత సత్ఫలితాలొస్తే మచిలీపట్నంలో కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల పనితీరును ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి పరిశీలించినట్లు మంత్రి నారాయణ వివరించారు. విలేఖర్ల సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెప్యూటీ డైరెక్టర్ కన్నబాబు, ఆర్జేడీ సకలారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.