ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర పథకాలు హైజాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 23: కేంద్రప్రభుత్వ పథకాలను తమవిగా ప్రచారం చేసుకుంటూ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయటంలేదని మరోవైపు బిజెపిపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి ఆక్షేపించారు. గుంటూరు జిల్లా పార్టీ మహాసభలో పురంధ్రీశ్వరి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశ పురోగతి సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా 14వ ఆర్థిక సంఘం నిధులు 2019 సంవత్సరానికి మేజర్ పంచాయతీలకు రూ.80 లక్షలు, మైనర్ పంచాయతీలకు రూ. 40 లక్షలకు పెరుగుతాయని వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా పెద్ద మొత్తంలో మంజూరయ్యాయని వౌలిక సదుపాయాలకు ఇక కొదవ లేదన్నారు. అయితే కొందరు సర్పంచులు ఇది రాష్ట్రానికి సంబంధించినవిగా ప్రచారం చేస్తున్నారని కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో కేంద్ర పథకాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు దెబ్బతింటే ఆన్‌లైన్ ద్వారా వాటిని నేరుగా రైతులే వివరించే అవకాశం కల్పించారని 15 రోజుల్లోగా బీమా పరిహారం అందించే విధంగా నూతన విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చుతోందని స్పష్టం చేశారు. అయితే నిధులు మంజూరు కావడంలేదని కేంద్రం సహకరించటంలేదనే వాదన సరైంది కాదన్నారు. నిధుల మంజూరుకు పద్దతులు ఉంటాయన్నారు. ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుండా నిధులెలా వస్తాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి లక్షా 40వేల కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించిందని అనేక సంస్థలను మంజూరు చేసిందన్నారు. మహిళల స్వావలంబనకు బేఠీ బచావ్.. బేఠీ పడావ్ కార్యక్రమంతో పాటు సుకన్య ద్వారా సామాజిక భద్రత కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారంతో నాటి ప్రధాని వాజ్‌పేయి గౌరవిస్తే నేటి ప్రధాని నరేంద్రమోదీ ఆయన నడయాడిన ప్రాంతాలను పంచతీర్థాలుగా ప్రకటించి రూ. 200 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించటం తమ పార్టీ అంబేద్కర్‌కు ఇచ్చిన గౌరవం ఏమిటో తెలియజేస్తోందన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అమరావతి, పోలవరం ప్రాజెక్టులను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. బీజెపి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే నిర్ణయాత్మక శక్తిగా రూపుదిద్దుకుందని 11.5 కోట్ల మంది సభ్యత్వంతో ప్రపంచ గుర్తింపు సాధించిందని చెప్పారు.

చిత్రం సభలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి