S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/26/2016 - 06:28

కాకినాడ, ఏప్రిల్ 25: పోలవరం ఎడమ కాలువ, పాములేరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2017 సంవత్సరాంతానికి పూర్తి చేస్తామని ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పలు మెట్ట ప్రాంతాలను సాగు కిందకు తీసుకువస్తామని హామీయిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని విధాన గౌతమీ సమావేశ హాలులో ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పతో కలసి యనమల సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

04/26/2016 - 06:27

విజయవాడ, ఏప్రిల్ 25: రాష్ట్ర రాజధాని అమరావతి నగరంపై దేశ విదేశీ సంస్థలు, పెట్టుబడిదారుల కళ్లన్నీ ఉండటంతో ఇక ఈప్రాంత భూములు రైతుల ఇంటి సిరులు పండించనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే సంఘ వ్యతిరేక శక్తుల వలలో పడి ఏ చిన్న ఆందోళన చేపట్టినా పెట్టుబడిదారులంతా వెనుదిరిగితే తీవ్రంగా నష్టపోయి కృష్ణానదిలో దూకాల్సిన పరిస్థితులు ఎదురవుతాయంటూ కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

04/26/2016 - 06:26

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: గోదావరి జిల్లాల్లో సోమవారం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద కాలువలోకి కారు దూసుకుపోయిన ఘటనలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడువద్ద అదుపుతప్పిన ట్రాక్టర్ దూసుకుపోయి ఇద్దరు అన్నదమ్ములు సహా మరో యువకుడు మృతిచెందారు.

04/26/2016 - 06:25

వరదయ్యపాళెం/తడ, ఏప్రిల్ 25: రాష్ట్ర విభజన తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇవి తాత్కాలికమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శాశ్వతంగా సమస్యలు పరిష్కారం కావాలంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం శ్రీసిటీలో తొలి దశలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో 134 ఎకరాల్లో ఏర్పాటుచేసిన క్యాడ్బరీ చాక్లెట్ ఫ్యాక్టరీని సోమవారం సిఎం ప్రారంభించారు.

04/25/2016 - 16:20

నెల్లూరు: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు వైద్య విద్యార్థులను కళాశాల యాజమాన్యం పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం వీరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

04/25/2016 - 14:05

ఏలూరు: దెందులూరు మండలం గోపన్నపాలెం వద్ద సోమవారం ఉదయం వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఓ బైక్‌ను ఢీకొనండతో ఇద్దరు పిల్లలు సహా ఓ వ్యక్తి మరణించాడు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

04/25/2016 - 14:05

కాకినాడ: అన్నవరంలో వివాహానికి హాజరయ్యేందుకు కారులో వెళుతుండగా ముగ్గురు మరణించారు. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద సోమవారం ఉదయం వేగంగా వెళుతున్న కారు రోడ్డుపక్కన పంట కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ కుటుంబం కారులో పెళ్లికి వెళుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

04/25/2016 - 14:03

గుంటూరు: ఉద్యోగులు సహకరించడం వల్లే పదిశాతం వృద్ధి రేటును ఎపి సాధించిందని సిఎం చంద్రబాబు అన్నారు. తాత్కాలిక సచివాలయం ప్రారంభం సందర్భంగా వెలగపూడిలో ఆయన మాట్లాడుతూ, మంచి పరిపాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు వారంలో అయిదురోజులే పనిదినాలు ఉంటాయని, అదనపు హెచ్‌ఆర్‌ఎ చెల్లిస్తామన్నారు. జూన్ 15 నాటికి ఉద్యోగులంతా కొత్త రాజధానికి చేరుకోవాలన్నారు.

04/25/2016 - 14:02

హైదరాబాద్: ఎపి మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు సుశీల్‌పై దాఖలైన కేసును ఉమ్మడి హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కారులో వెళుతూ ఓ వివాహితను వేధింపులకు గురిచేసినట్లు సుశీల్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్ తరఫు న్యాయవాది కోర్టులో క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించి కేసును కొట్టివేసింది.

04/25/2016 - 12:34

విశాఖ: తెలుగుదేశంలో చేరేందుకు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన సోమవారం ఉదయం అరకులో వైకాపా నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. టిడిపిలో చేరే ముందు తన మనోభావాలను అందరితో పంచుకునేందుకు ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం ముగిశాక ఆయన టీడీపీలో ఏ రోజు చేరాలన్న విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Pages