ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: గోదావరి జిల్లాల్లో సోమవారం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద కాలువలోకి కారు దూసుకుపోయిన ఘటనలో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడువద్ద అదుపుతప్పిన ట్రాక్టర్ దూసుకుపోయి ఇద్దరు అన్నదమ్ములు సహా మరో యువకుడు మృతిచెందారు. జొన్నాడ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై వెళుతున్న ఇన్నోవా కారు సోమవారం తెల్లవారుజామున 4.50 గంటల సమయంలో అదుపుతప్పి గోదావరి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. భీమవరం సమీపంలోని విస్సాకోడేరుకు చెందిన పెళ్లి బృందం అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్తుంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మంకు రాధా శ్రీను (35) ఆయన కుమార్తెలు మాధవిశ్రీ (6), కృష్ణశ్రీ (4) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హైవే అంబులెన్స్‌పై రాజమహేంద్రవరం తరలించగా, ఆసుపత్రిలో చేర్చిన కొద్దిసేపటికే మృతిచెందారు. రాధాశ్రీను భార్య భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగావుంది. నవ దంపతులు సహా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సోమవరప్పాడు వద్ద రోడ్డుపక్కన వేచివున్న వారిపైకి అదుపుతప్పిన మట్టి ట్రాక్టరు దూసుకుపోయింది. కె.కన్నాపురానికి చెందిన పంపన లోకేష్ (7) అతని సోదరుడు శరత్‌కుమార్ (5), పలివెల రమేష్ (27) అక్కడికక్కడే మృతిచెందారు. లోకేష్, శరత్‌కుమార్‌ల తల్లి గాయత్రి తీవ్రంగా గాయపడింది. వేగవరంలోని ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం గాయత్రి తన పిల్లలతో వచ్చి, తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. కుమారులిద్దరి మరణవార్త తెలిసి వారి తండ్రి పంపన విష్ణుమూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.