S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/25/2016 - 08:16

విశాఖపట్నం, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించడం ద్వా రా గణనీయమైన పురోభివృద్ధి సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

04/25/2016 - 06:34

అరకులోయ/కర్నూలు, ఏప్రిల్ 24: మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు పసుపుపచ్చ కండువా కప్పుకోబోతున్నారు. విశాఖ జిల్లా అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు తెలిసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సోమ లేదా మంగళవారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నట్టు తెలిసింది.

04/25/2016 - 06:31

గుంటూరు, ఏప్రిల్ 24: రాజధానిలో భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో నిబంధనలు.. మార్గదర్శకాలను సీఆర్డీఏ ప్రకటించింది. కొద్దిరోజుల కిందట విజయవాడలో రైతుల ప్లాట్లపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందు లో రైతులు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తిచేస్తూ నిబంధనలను రూపొందించారు. అమరావతి నిర్మాణంకోసం ప్రభుత్వం 20 వేలమంది రైతుల నుంచి 33,500 ఎకరాలను సేకరించింది.

04/25/2016 - 06:24

విశాఖపట్నం, ఏప్రిల్ 24: సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఆరు డిగ్రీల సెల్సియస్ వరకూ అధికంగా నమోదు అవుతుండటంతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతోపాటు కోస్తాంధ్రలో వడగాడ్పుల తీవ్రత మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని చెబుతోంది.

04/25/2016 - 05:36

విజయవాడ, ఏప్రిల్ 24: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వెలగపూడి సమీపంలో 42.90 ఎకరాలలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం సోమవారం ప్రారంభమవుతోంది. జూన్ నాటికి హైదరాబాద్‌నుంచి సచివాలయ ఉద్యోగులందరినీ తరలించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు.

04/24/2016 - 17:08

న్యూదిల్లి:ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని దిల్లీలో బిజీబిజీగా గడిపారు. ఆదివారం ఉదయం న్యాయవేత్తలు, ముఖ్యమంత్రులు, కేంద్రప్రభుత్వం సారథ్యంలో జరిగిన న్యాయసదస్సుకు హాజరైన ఆయన ఆ తరువాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో సమావేశమయ్యారు. పోలవరం సహా పలు ప్రాజెక్టులపై ఆమెతో చర్చించారు.

04/24/2016 - 17:08

న్యూదిల్లి:మద్యం వ్యాపార దిగ్గజం విజయ్‌మాల్యా పాస్‌పోర్టును విదేశాంగశాఖ రద్దు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అభ్యర్థన మేరకు ఈ చర్యలు తీసుకుంది. ఆయనను దేశానికి రప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. వివిధ బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల రూపాయల రుణం చెల్లించకుండా దేశం విడిచి వెళ్లిపోయిన విజయ్‌మాల్యాపై చర్యలను కేంద్రం ప్రభుత్వం వేగవంతం చేసింది.

04/24/2016 - 17:07

పుట్టపర్తి:ప్రకృతిని పట్టించుకోకపోతే ఇప్పుడు ఎథుర్కొంటున్నటువంటి తీవ్ర కరవు పరిస్థితులు ఎదురవుతాయని, అందువల్ల చెట్లను పెంచడం, ఇంకుడు గుంతల తవ్వకం వంటి పనులు ఉద్యమంలా చేపట్టాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సూచించారు. పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.

04/24/2016 - 07:53

హైదరాబాద్, ఏప్రిల్ 23: స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ విషయంలో అందరికీ చాలా స్పష్టత అవసరమని శాసనసభ స్వీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ కార్పొరేషన్ సిఇఓ మురళీధర్, సిఓఓ సురేష్‌లతో శాసనసభాపతి సమావేశమయ్యారు.

04/24/2016 - 07:52

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన పేర మీద ఉన్న ప్లాట్‌ను తన కుమారుడు ఆక్రమించుకున్నాడంటూ ఒక కన్నతల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అంతకు ముందు ఈ ప్లాట్ తనదేనని ఆమె కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే మంజూరు చేసింది.

Pages