ఆంధ్రప్రదేశ్‌

‘స్వచ్ఛ కార్పొరేషన్’పై స్పష్టత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: స్వచ్ఛ భారత్ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ విషయంలో అందరికీ చాలా స్పష్టత అవసరమని శాసనసభ స్వీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ కార్పొరేషన్ సిఇఓ మురళీధర్, సిఓఓ సురేష్‌లతో శాసనసభాపతి సమావేశమయ్యారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పనితీరును వేగవంతం చేయాలని, వివిధ శాఖలను సమన్వయం చేసుకోవల్సిన బాధ్యత సంస్థదేనని సభాపతి కోడెల అన్నారు. ఆధునిక సాంకేతకతను అందిపుచ్చుకోవడం ద్వారా పలు సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చని అన్నారు. సిఎం చంద్రబాబునాయుడు ఒక లక్ష్యం మేరకు ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని వాటిని చేరుకునే దిశలో ముందడుగు వేయాలని అన్నారు. ఎవరు ఏ పనిచేయాలన్న దానిపై స్పష్టత ఉండాలని అందుకు అవసరమైన అజెండా సిద్ధం చేయాలని సభాపతి కోడెల స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పూర్వపు పనితీరు, భవిష్యత్ లక్ష్యాలను సమీక్షించిన సభాపతి అధికారులకు దిశానిర్దేశనం చేశారు, కార్పొరేషన్ వ్యవహారాల్లో అందరినీ భాగస్వామ్యులను చేయాలని, ప్రత్యేకించి ఎన్‌జిఓల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ నెల 28, 29 తేదీల్లో స్వచ్ఛ కార్పొరేషన్ అజెండా ఖరారుపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని సభాపతి ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రత్యేకించి తమ దాతృత్వం సద్వినియోగం అవుతుందని భావిస్తే ఎంత మేరకైనా నిధులు విరాళంగా ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారని, అయితే వారికి తగినంత ప్రచారం కల్పించాలని అపుడే ఒకరిద్దరుగా, వారు తిరిగి పదులు, వందల సంఖ్యలో ముందుకు వస్తారని డాక్టర్ కోడెల అన్నారు. విభిన్న ప్రాజెక్టులను పిపిపి విధానంలో చేపట్టడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతామని దీనిని చేపట్టేందుకు కార్పొరేషన్‌కు స్పష్టత కావాలని , ఎవరు ఏ పనిచేయాలన్నదే ఇక్కడ కీలకమని సభాపతి వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను, పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఆయా నగర పాలక, పురపాలక సంస్థల అధికారులను సమావేశపరచాలని, ఏ విధాగం ఏ తీరుగా వ్యవహరిస్తామన్న దానిపై తనకు నివేదిక అందించాలని డాక్టర్ కోడెల ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్‌ను ఉన్నత లక్ష్యాలతో ఏర్పాటు చేశారని, ఒక మరుగుదొడ్ల నిర్మాణమే గాక, పరిశుభ్రత , పచ్చదనం వంటి అంశాలు కూడా మిషన్‌లో భాగమేనని అన్నారు. సభాపతి శివప్రసాదరావు స్వచ్ఛ మిషన్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా, వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణంతో రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే తపన పడుతున్నారు.