ఆంధ్రప్రదేశ్‌

మాడ్చే ఎండలు మరో 5 రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 24: సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఆరు డిగ్రీల సెల్సియస్ వరకూ అధికంగా నమోదు అవుతుండటంతో తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే పరిస్థితి మరో ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతోపాటు కోస్తాంధ్రలో వడగాడ్పుల తీవ్రత మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని చెబుతోంది. మరోవైపు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మే నెల నాటికి 50 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతకు చేరుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నెల్లూరు, నందిగామ, తిరుపతిలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు, ఒంగోలులో 5 డిగ్రీలు నమోదైంది. తెలంగాణ, రాయలసీమలో సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. జంగమేశ్వరంలో 45.6, ఖమ్మం, నల్గొండ, భద్రాచలం, రామగుండంలో 45, తిరుపతిలో 45.7, నెల్లూరులో 44.6, ఆనంతపురంలో 43.2. నిడదవోలులో 43.2 డిగ్రీలు నమోదైంది. కావలి, గన్నవరం, ఆరోగ్యవరం, హైదరాబాద్‌ల్లో దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కోస్తాతీరంలోని తునిలో 39.9, కళింగపట్నంలో 35, విశాఖ విమానాశ్రయంలో 37.8 కాకినాడలో 38.4 డిగ్రీలు నమోదు అయ్యాయి. దీనికి తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. రాత్రివేళల్లోనూ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఐదు రోజుల వరకూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో నమోదు అవుతాయని, వీలైనంత వరకూ ఎండలో తిరగకుండా ఉండేలా ప్రయత్నించాలని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు.