ఆంధ్రప్రదేశ్‌

స్వశక్తీకరణ దిశగా పంచాయతీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 24: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించడం ద్వా రా గణనీయమైన పురోభివృద్ధి సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్స వం సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రం జంషెడ్‌పూర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో లభించిన పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంత్రి అయ్యన్న అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని, స్వశక్తీకరణ దిశగా పంచాయితీలను తీర్చిదిద్దగలిగామన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలంటే గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించాల్సి ఉందని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారన్నారు. రెండేళ్ల కిందట సాలీనా రూ.220 కోట్ల వార్షికాదాయంతో ఉన్న పంచాయతీలు ఇప్పు డు రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. ముఖ్యంగా పంచాయితీల్లో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం వంటి అవసరాలను తీర్చడంతో పాటు సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో విద్య, ఆరోగ్యం, వైద్యం, పశుసంవర్ధక, స్ర్తి,శిశు సంక్షేమం, నీరు-చెట్టు కార్యక్రమాల నిర్వహణకు సైతం ప్రణాళికలు రూపొందించి చేపట్టనున్నట్టు వెల్లడించారు. పంచాయతీల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచాయతీలకు శిరోభారంగా మారిన ఘన వ్యర్థాల నిర్వహణలో ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని 659 పంచాయతీల్లో రూ.111 కోట్లతో ఘన వ్యర్థాల నిర్వహణ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు వెల్లడించారు. అన్ని పంచాయతీలను డిజిటలైజేషన్ చేస్తున్నామని, ఈ ప్రగతి తమకు అవార్డును అందుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. అవార్డుతో పాటు రూ.2 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా మంత్రి అయ్యన్నపాత్రుడు, పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి అందుకున్నారు.

ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న
ఏపి పంచాయితీరాజ్ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు
మాదిగల ఉద్యమం
నిర్వీర్యం చేసేందుకు కుట్ర
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎస్సీ వర్గీకరణపై ఉద్యమిస్తున్న మాదిగల ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. కెసిఆర్ సిఎం కావడానికి కీలక వ్యక్తిని నేనే టూ చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి డిఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని హామి ఇచ్చిన కడియం మాట మార్చారని ధ్వజమెత్తారు. మే 10లోగా అఖిలపక్షంతో ఢిల్లీకి వస్తున్నట్టుగా సిఎం కెసిఆర్‌తో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. మాదిగల ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు మంత్రి ఈటెల, సిఎం కెసిఆర్‌కు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ప్రతిష్ఠాత్మకంగా
కృష్ణా పుష్కరాలు

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
స్మార్ట్ ఇంటెలిజెన్స్ విధానం అమలు
మే 15 నాటికి పుష్కర పనులన్నీ పూర్తి
ఏపి ప్రభుత్వం సన్నాహాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24: కృష్ణాపుష్కరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతం కేంద్రంగా జరుగుతున్న 2016 కృష్ణా పుష్కర ఘట్టానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. యాత్రీకులకు సౌకర్యాలతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు కదులుతోంది. మే 15వ తేదీ నాటికి కృష్ణా పుష్కరాల పనులను పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ ఠక్కర్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో పుష్కరాల అవసరం కోసం చేపట్టే పనులన్నీ తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతపదికన చేపడుతున్నారు. పుష్కరాల నిర్వహణలో ముఖ్యంగా పురపాలక శాఖ, పర్యాటక, రహదారులు, భవనాల శాఖలతో పాటు పోలీసు శాఖ కీలక భూమిక పోషించనుంది. ఈ శాఖల మధ్య పూర్తి సమన్వయం ఉండాలని ఠక్కర్ సూచించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నిర్వహణతో పాటు క్యూలైన్ల పర్యవేక్షణ, పుష్కరాలకు వచ్చే యాత్రీకులకు సంబంధించిన భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సిఎస్ నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, తొక్కిసలాట జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రవేశ ద్వారంతో పాటు బయటకు వచ్చే ద్వారాలు వేరుగా ఉండాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా కృష్ణానదికి ఇచ్చే హారతి కార్యక్రమాన్ని సంప్రదాయ, కట్టుబాట్లను ఖచ్చితంగా ఆచరిస్తూ చేపట్టాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. స్మార్ట్ ఇంటిలిజెన్స్ విధానం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, సమూహాలను నియంత్రించడం వంటి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని ఆయన తెలిపారు.

నేడు ఢిల్లీకి జగన్

చంద్రబాబు తీరుపై రాష్టప్రతి, ప్రధానమంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్న వైకాపా
రాజ్యసభ సీటు వైకాపాకు దక్కకుండా టిడిపి ఎత్తుగడ

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఆంధ్రరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. వైకాపా నుంచి వచ్చే ప్రతి ఎమ్మెల్యేను చేర్చుకోవడంతో టిడిపిపై ఫిర్యాదు చేసేందుకు వైకాపా పార్టీ అధినేత, విపక్ష నేత జగన్ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఆయన భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టిడిపిలోకి చేర్చుకుంటున్నారని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేయాలని, లోపాలను సవరించాలని కోరనున్నారు. అలాగే స్పీకర్‌కు ఎన్నిసార్లు ఈ విషయమై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై కూడా ఆయన రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైకాపా నుంచి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా వెంగళరెడ్డి, విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కూడా టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. వీరితో ఇంతవరకు 15 మంది ఎమ్మెల్యేలు వైకాపా వదిలి టిడిపి గూటికి చేరినట్లవుతుంది. శాసనసభలో 67 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న వైకాపాలో 15 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ కావడంతో ఆ పార్టీ బలం 52కు పడిపోయింది.
కాగా వచ్చే జూన్‌లో ఆంధ్ర శాసనసభ నుంచి నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నిక జరగనుంది. ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుంది. టిడిపికి ఎటూ 3 సీట్లు వస్తాయి. వైకాపాకు ఒక్క సీటుకూడా దక్కకుండా చేసేందుకు మరో 15 మంది ఎమ్మెల్యేలను లాక్కోవాలని టిడిపి ఎత్తుగడగా కనపడుతోంది. దీని వల్ల వైకాపాను నైతికంగా దెబ్బతీసినట్లవుతుందని టిడిపి వ్యూహంగా ఉంది.
జగన్ ఢిల్లీకి వెళ్లి రాష్టప్రతిని కలిసి వివిధ అంశాలపై వినతిపత్రం ఇవ్వడం కొత్తకాదు. రాష్ట్ర విభజన సమయం నుంచి ఇంతవరకు కనీసం పది సార్లు ఆయన రాష్టప్రతిని కలిశారు. వేసవి కాలం ముగిసిన వెంటనే చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై ఉవ్వెత్తున ఉద్యమాలు నిర్మించాలనే యోచనతో జగన్ ఉన్నారు. ఈ విషయమై ఇటీవల జరిగిన పార్టీ జిల్లా నేతలు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు.