ఆంధ్రప్రదేశ్‌

ప్లాట్‌పై హక్కుకోసం కోర్టుకెక్కిన తల్లి,కొడుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన పేర మీద ఉన్న ప్లాట్‌ను తన కుమారుడు ఆక్రమించుకున్నాడంటూ ఒక కన్నతల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అంతకు ముందు ఈ ప్లాట్ తనదేనని ఆమె కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా సింగిల్ జడ్జి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే మంజూరు చేసింది. ఈ ఆదేశాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే , జస్టిస్ పి నవీన్ రావుతో కూడిన ధర్మాసనం జారీ చేసింది. తన కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్‌ను తన కుమారుడు ఆక్రమించుకున్నాడంటూ ఎంపి దామోదరం అనే రిటైర్డు ఉద్యోగి భార్య ఎంపి వాసంతి అనే 80 సంవత్సరాల వృద్ధురాలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, కొన్ని ఆస్తులను కూడా తన భర్త ఇచ్చి మరణించారన్నారు. తన భర్త నిరుడు జనవరిలో మరణించారని, అప్పటి నుంచి తన కుమారుడు ఆస్తులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. తన ప్లాట్‌ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు తల్లితండ్రులు, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టం 2007 నిబంధనల కింద పిటిషన్‌ను స్థానిక ఆర్డీవోకు సమర్పించానన్నారు. ఈ ప్లాట్ తనకే చెందుతుందని, పోలీసుల సహాయంతో ఆ ఆస్తిని తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారన్నారు. కాగా ఆమె కుమారుడు ఈ ఆస్తిని తానే కొనుగోలు చేసి తన తల్లిపై రిజిస్టర్ చేయించానని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి కోర్టు కుమారుడికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఆర్డీవో ఆదేశాలను కూడా సింగిల్ జడ్జి కొట్టివేశారు. దీనిని సవాలు చేస్తూ 80 సంవత్సరాల కన్నతల్లి వాసంతి సింగిల్ జడ్జి ఆదేశాలను సవాలు చేస్తూ ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం సింగిల్ జడ్జి కోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది.