ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి మరో ఇద్దరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ/కర్నూలు, ఏప్రిల్ 24: మరో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు పసుపుపచ్చ కండువా కప్పుకోబోతున్నారు. విశాఖ జిల్లా అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు తెలిసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సోమ లేదా మంగళవారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నట్టు తెలిసింది. ఆయన టిడిపిలో చేరనున్నట్టు గత కొంతకాలంగా అనుకుంటున్నప్పటికీ తన రాజకీయ గురువైన కొణతాల రామకృష్ణ నిర్ణయం కోసం ఇంతవరకు ఆగారని సమాచారం. కాగా కర్నూలు జిల్లా వైకాపా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా రేపో మాపో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నుంచి తన సన్నిహితులతో చర్చలు జరిపి సాయంత్రం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న తన వర్గీయులతో మాట్లాడారు. మాజీ మంత్రి, దివంగత బుడ్డా వెంగళరెడ్డి కుమారుడైన బుడ్డా రాజశేఖరరెడ్డి సతీమణి శైలజ 2004లో, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 2009లో టిడిపి తరపున పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2014 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి బుడ్డా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయనను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకున్నారు. పార్టీలో కీలక నేతగా ఎదుగుతూ అధినేత జగన్‌కు సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు కూడా పొందారు. అయితే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన సందర్భంలో బుడ్డా కూడా ఆయన వెంటే వెళ్తారన్న ప్రచారం సాగింది. ల్లా కేంద్రంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి బుడ్డా గైర్హాజరయ్యారు. దీంతో బుడ్డా పార్టీ వీడటం ఖాయమని అంతా నిర్ణయానికి వచ్చారు. పార్టీ మార్పుపై బుడ్డా రాజశేఖరరెడ్డిని వివరణ కోరగా నియోజవర్గంలోని తన సన్నిహితులు, వర్గీయులతో చర్చలు జరుపుతున్నానని వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.