S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/23/2016 - 17:43

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన మే 2న ఇక్కడ మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఉద్యోగాల భర్తీ, వర్షాభావం, ఎండల తీవ్రత, రైతులకు రుణమాఫీ వంటి అనేక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

04/23/2016 - 13:25

హైదరాబాద్:తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి పెచ్చుపెరిగిపోయిందని, ఇసుక మాఫియాతో అధికార పార్టీ నాయకులు, మంత్రులు చేతులు కలిపి అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో బినామి పేర్లతో భూములు కొన్నాకే అమరావతిని కేపిటల్‌గా ప్రకటించిన బాబు అవినీతి సొమ్ముతో మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

04/23/2016 - 13:24

విజయవాడ:కాపు ఐక్యగర్జన సందర్భంగా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టి, తుని పట్టణంలో విధ్వంసానికి పాల్పడిన నిందితులను గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం, వీడియో ఫుటేజీలో దృశ్యాలను నిశితంగా పరిశీలించిన ఏపి సిఐడి పోలీసులు విధ్వంసానికి పాల్పడినవారిలో కొందరిని గుర్తించగలిగారు.

04/23/2016 - 13:23

కరాచి:పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫంక్తుంక్వా ప్రావిన్స్‌లో మైనారిటీ మంత్రి సర్దార్ సోరన్‌సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో మరణించారు. బునేర్ జిల్లాలో కారులో ప్రయాణిస్తుండగా బైక్‌పై వచ్చిన దుండగులు కారుని ఆపి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇది తాలిబన్ల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

04/23/2016 - 06:28

విశాఖపట్నం, ఏప్రిల్ 22: రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. సరైన నియంత్రణ లేకపోవడంతో పాటు కొన్ని సంస్థల నిర్లక్ష్య వైఖరి కూడా సైబర్ నేరాల వృద్ధికి కారణమవుతోంది. గత ఐదేళ్లలో కోట్లాది రూపాయల సొత్తు నేరగాళ్ల పాలైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సైబర్ నేరాల నమోదులో విశాఖపట్నం దేశంలో రెండో స్థానంలో ఉంది.

04/23/2016 - 06:27

తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 22: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత ఆచార్య ఆత్రేయ భార్య కిళాంబి ఉత్సూరు పద్మావతి ఆత్రేయ (90) శుక్రవారం కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లముదునూరుపాడులోని ఆమె సోదరి వింజమూరి మధురవల్లి ఇంట్లో ఆమె కన్నుమూశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడుకు చెందిన ఆచార్య ఆత్రేయను కిళాంబి వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు.

04/23/2016 - 06:27

హైదరాబాద్, ఏప్రిల్ 22: జగన్ అక్రమాస్తుల కేసులో సీనియర్ ఐఎఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌పై వచ్చిన అభియోగాలను విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టులో క్రిమినల్స్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధిస్తూ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా, రంగారెడ్డి జిల్లాలో ఇండియా సిమెంట్స్‌కు చెందిన ఫ్యాక్టరీకి నీటిని కేటాయించారనే అభియోగాలను మోపుతూ సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది.

04/23/2016 - 06:26

హైదరాబాద్, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజన సరైన చర్యని, చట్టబద్ధమని, తెలంగాణ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు ఆ రాష్ట్రప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జిని నియమించే అధికారం ఉందని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఏపి మార్కెటిగ్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజనను సవాలు చేస్తూ కొంత మంది డైరెక్టర్లు 2014 మే నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

04/23/2016 - 06:25

హైదరాబాద్, ఏప్రిల్ 22: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, సరుకు రవాణా, వాహనాల వివరాలు తెలుసుకునేందుకు కొత్త సంస్కరణలు చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా, భవనముల శాఖ మంత్రి సిద్దా రాఘవరావు తెలిపారు.

04/23/2016 - 06:25

గుంటూరు, ఏప్రిల్ 22: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో సర్వ హంగులతో సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో ఇక్కడి నుంచి పార్టీ సమావేశాలు నిర్వహించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఉగాది పండుగ రోజునే హైదరాబాద్ నుండి రాష్ట్ర కార్యాలయాన్ని తరలించాల్సి ఉంది.

Pages