S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/24/2016 - 07:51

హైదరాబాద్, ఏప్రిల్ 23: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే గురుకుల పాఠశాలల్లో చదువుకుంటూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రభు త్వం వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని, తద్వారా మెరుగైన ఫలితాలను సాధిస్తుందని సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు.

04/24/2016 - 07:50

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కేంద్రాల ప్రక్షాళన జరగాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. మహారాష్టల్రో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను పరిశీలించి వచ్చిన స్పీకర్ అక్కడ విజయవంతమైన పద్ధతులను ఆంధ్రాలో అమలుచేయాలని సూచించారు. శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో భేటీ అయ్యారు.

04/24/2016 - 07:50

ఆదిలాబాద్/మహబూబ్‌నగర్/ నల్లగొండ/కరీంనగర్/ వరంగల్/మెదక్, ఏప్రిల్ 23: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణతాపం నమోదవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కంటే ప్రతి రోజు 4 నుండి 5 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో శనివారం 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు నమోదయ్యాయి.

04/24/2016 - 07:49

మునగాల, ఏప్రిల్ 23: బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామానికి చెందిన నార్ల కొండస్వామి, ఎస్‌కె.సైదాసాహెబ్, దినికొండ రాజుతో పాటు మండలంలోని కప్పలకుంటతండాకు చెందిన భూక్యా వెంకటరామదాసు బంధువుల ఇంట్లో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు విజయవాడకు వెళ్తున్న లారీని ఆపి ఎక్కారు.

04/24/2016 - 07:44

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో హార్బర్ల అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం కలలుగన్న సాగరమాల ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది. ఈ హార్బర్ రాకతో స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురుచూస్తున్నారు. దేశంలోనే తొలి డ్రెడ్జింగ్ హార్బర్‌కు అంతర్వేది కేంద్రంగా మారింది.

04/24/2016 - 07:42

ఒంటిమిట్ట, ఏప్రిల్ 23: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పదో రోజు శనివారం ఉదయం సీతారామలక్ష్మణులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపి గ్రామోత్సవంగా స్థానిక రామతీర్థానికి తీసుకెళ్లారు. అక్కడ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

04/24/2016 - 07:40

కాకినాడ, ఏప్రిల్ 23: ఈ ఏడాది జనవరి 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపుల ఐక్య గర్జన సభలో జరిగిన దురదృష్టకర సంఘటనలకు సంబంధించి కేసు విచారణను సిఐడి వేగవంతం చేసింది. తుని హింసకు బాధ్యులైన నిందితులను 10-15 రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దుర్ఘటన సమయంలో ఆయా హింసాత్మక ప్రదేశాల్లో సుమారు 300 మంది ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

04/24/2016 - 07:39

హైదరాబాద్, ఏప్రిల్ 23: రాయలసీమలో ఎండలు మండుతున్నాయి. శనివారం కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో కూడా వేడి ఏ మాత్రం తగ్గకపోవటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. శనివారం కర్నూలు జిల్లాలో సగటున 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కర్నూలులో 44.4, నంద్యాలలో 44.3, ఆదోనిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

04/24/2016 - 07:39

గుంటూరు, ఏప్రిల్ 23: తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతితో సంపాదించిన సొమ్ముతోనే వైసిపి ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తూ వైసిపి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. గుంటూరు నగరంలోని లాడ్జిసెంటర్‌లో గల రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి టిడిపి తీరుపై మండిపడ్డారు.

04/24/2016 - 07:38

విజయవాడ, ఏప్రిల్ 23: దేశంలో, రాష్ట్రంలో సాగునీరు, మంచినీరు, ఉపాధి లేక కోట్లాది మంది కరవుబారిన పడి కొట్టుమిట్టాడుతున్నారని, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారని, కరవు సహాయక చర్యలు చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

Pages