ఆంధ్రప్రదేశ్‌

థర్మల్ కేంద్రంలో విరిగిన కోల్‌స్టాకర్ రీక్లైమర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, ఏప్రిల్ 23: నెల్లూరు జిల్లా మండలంలోని దామోదరం సంజీవయ్య ఎపి జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు రవాణా కేంద్రం వద్ద విరిగిన సంఘటన కోల్‌స్టాకర్ రీక్లైమర్ ప్రమాదం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎపి జెన్‌కో ఇంజనీర్ల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బొగ్గు రవాణా కేంద్రం వద్ద బొగ్గును తోడి కన్వర్ట్‌బెల్టులోకి నింపేటువంటి కోల్‌స్టాకర్ రీక్లైమర్ యంత్రం మరమ్మతులకు గురై వంగిపోయింది. ఈ ప్రమాదం వల్ల ఎపి జెన్‌కో ప్రాజెక్టుకు సుమారు ఐదు కోట్ల వరకు నష్టం వాటిల్లింది. కోల్‌కతకు చెందిన నెల్‌కాన్ అనే కంపెనీ ఈ పరికరాన్ని తయారుచేసింది. విరిగిన స్టాకర్‌ను పరిశీలించేందుకు ఆదివారం ఇన్స్యూరెన్స్ సంస్థ వారు థర్మల్ కేంద్రానికి విచ్చేస్తున్నట్లు సమాచారం. స్టాకర్ వంటి యంత్రం మరొకటి ఉండటం వల్ల విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. యథావిధిగా విద్యుత్ ఉత్పత్తి సాగుతోంది. విరిగిన యంత్రానికి మరమ్మతులు చేయడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని ఎపి జెన్‌కో ఇంజనీర్లు తెలిపారు.