ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, ఏప్రిల్ 21: ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిరుపేదలకు సామూహిక వివాహాలు జరిపించే విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలోని తిరుమల దేవర ఆలయంలో గురువారం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సామూహిక వివాహాలను ప్రభుత్వమే ఎందుకు నిర్వహించకూడదన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. దివంగత నేత పరిటాల రవి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని, నసనకోటలోని పురాతన ఆలయం తిరుమల దేవర గుడి పునర్నిర్మాణంతోపాటు సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టి నసనకోటలో ఆలయ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గురుకుల పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడ మరిన్ని కల్యాణమండపాలు నిర్మించి నిరంతరం పెళ్లిళ్లు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం వివాహాలు చేసుకున్న 250 జంటలకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తామన్నారు. ఈ సందర్భంగ నూతన వధూవరులకు స్వయంగా అక్షింతలు జల్లి ఆశీర్వదించారు. జిల్లాలో అపెరల్ పార్క్, సెంట్రల్ యూనివర్శిటీ, సోలార్ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతికి వెళ్లేందుకు వీలుగా బెంగళూరు నుండి రైలును నడిపేందుకు ప్రయతిస్తున్నామన్నారు. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌లు మాట్లాడుతూ ఆలయ సమీపంలో పరిటాల రవీంద్ర విగ్రహాన్ని ఏర్పాటుచేయాలన్న తమ 11 సంవత్సరాల కల నేడు ఫలించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విగ్రహాన్ని తెచ్చిన 7 సంవత్సరాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తమ కోరికను మన్నించి, ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తమ కుటుంబం ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞతగా వుంటుందన్నారు.

చిత్రం సామూహిక వివాహాలు చేసుకున్న జంటలను ఆశీర్వదిస్తున్న సిఎం