S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/21/2016 - 10:28

సీతంపేట, ఏప్రిల్ 20: గత కొద్దికాలంగా ప్రశాంతంగా ఉన్న సీతంపేట మన్యంలో ఏనుగుల ఘీంకారాలు మళ్లీ వినిపిస్తున్నాయి. గడిచిన నాలుగు నెలలు నుంచి మైదాన ప్రాంతాల్లో సంచరించిన గజరాజులు బుధవారం వేకువజామున శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం కె.గుమడ గ్రామానికి అనుకుని ఉన్న టేకువనంలోకి ప్రవేశించాయి. తెల్లవారుజామున మోహన్‌కాలనీ గ్రామంవైపు వచ్చిన ఏనుగులు చిన్నారావు, పోతమ్మకు చెందిన పూరిపాకలను ధ్వంసం చేశాయి.

04/20/2016 - 18:00

కడప: కడప జిల్లాలోని ఒంటిమిట్టకు ఎపి సిఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. సుమారు 34 కోట్ల రూపాయలతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల నీటి పథకం పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈరోజు రాత్రి ఒంటిమిట్ట కోదండ రామాయలంలో నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవంలో చంద్రబాబు దంపతులు పాల్గొంటారు. ఎపి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయన స్వామివారికి సమర్పిస్తారు.

04/20/2016 - 17:59

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. సుమారు 50 ఎకరాల మేరకు అడవి కాలిపోయిందని, ఫైర్ సిబ్బంది ఇంకా మంటలను అదుపుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలేవీ ఇంకా తెలియరాలేదు.

04/20/2016 - 17:58

ఒంగోలు: పోలీసుల వేధింపు చర్యలకు తాళలేక ప్రకాశం జిల్లా గిద్దలూరులో బుధవారం అనిల్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నాంచాడు. తీవ్రంగా గాయపడిన ఇతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.

04/20/2016 - 17:06

విజయవాడ: అశాస్ర్తియంగా రాష్ట్ర విభజన జరిగినందున కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. అందరితో చర్చించి రాష్ట్రాన్ని విభజించి ఉంటే నేడు ఎపికి ఇన్ని కష్టాలు ఉండేవి కావని తాను ఇదివరకే పలుసార్లు చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక్కడ బుధవారం జరిగిన టిడిపి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పాలకులు పెద్ద తప్పు చేశారన్నారు.

04/20/2016 - 17:05

విజయవాడ: అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కుని బెయిల్‌పై బయట తిరిగేవారు ఎన్నటికీ నేతలు కాలేరని కేంద్రమంత్రి అశోకగజపతి రాజు వ్యాఖ్యానించారు. పరోక్షంగా వైకాపా అధినేత జగన్‌ను ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన టిడిపి సమావేశంలో అశోక్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలను నిర్లక్ష్యం చేసిన పార్టీ (కాంగ్రెస్) ఇపుడు ఎక్కడా కనిపించకుండా పోయిందన్నారు.

04/20/2016 - 17:05

విజయవాడ: విభజన చట్టంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం అమలు చేయాలని సిఎం చంద్రబాబు అన్నారు. మిగతా రాష్ట్రాల్లా అభివృద్ధి చెందేవరకూ ఎపికి అన్ని విధాలా ఆర్థిక సాయం అందించాలని ఆయన బుధవారం ఇక్కడ జరిగిన టిడిపి సమావేశంలో అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజీ లేదన్నారు.

04/20/2016 - 17:04

విజయవాడ: అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరించడంలో జగన్ విఫలమయ్యారని, ఈ కారణంగానే వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావు అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఇంకెవరూ అభివృద్ధి చేయలేరన్న నిజాన్ని గ్రహించి వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారన్నారు.

04/20/2016 - 17:02

విశాఖ: నగరంలో బిఎస్సీ రెండో సంవత్సరం కెమిస్ట్రీ ప్రశ్నపత్రం బుధవారం లీక్ అయ్యింది. కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేసి ఈ పేపర్‌ను విద్యార్థులకు వాట్సప్ ద్వారా పంపించారు. మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష జరగాల్సి ఉండగా కొన్ని గంటల ముందే పేపర్ లీక్ అయింది. ఈ విషయం తెలిశాక ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

04/20/2016 - 17:02

ఒంగోలు: 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధించి తన తండ్రి చంద్రబాబు మళ్లీ సిఎం పీఠాన్ని అధిష్ఠిస్తారని టిడిపి యువనేత నారా లోకేష్ అన్నారు. ఆయన బుధవారం త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ, రోజంతా విద్యుత్ అందిస్తున్న ఘనత తన తండ్రికే దక్కిందన్నారు.

Pages