S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/20/2016 - 12:31

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఇక్కడి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన అమ్మవారి ఆలయానికి వచ్చారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఆయన జన్మదినాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు టిడిపి నేతలు, కార్యకర్తలు నగరంలో విస్తృత సన్నాహాలు చేశారు.

04/20/2016 - 07:25

చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా వైకాపా పోరుబాట
25న పార్టీ పిరాయింపులకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ
మే 2న మండల కేంద్రాల్లో ఖాళీ బిందెల ప్రదర్శన కొవ్వొత్తుల ర్యాలీ
మొదటి వారంలో రాష్టప్రతి, ప్రధాని, ఇసిని కలవనున్న పార్టీ నేతలు
పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం

04/20/2016 - 07:24

గుంటూరు, ఏప్రిల్ 19: రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పనితీరుకు కేటాయించిన ర్యాంకులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారో అర్థంకావడం లేదని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించడం విశేషం. సీనియర్లను పక్కనబెట్టి జూనియర్లకు అగ్రతాంబూలం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది.

04/20/2016 - 07:04

విజయవాడ, ఏప్రిల్ 19: వచ్చే నెల 24న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఇంటర్‌మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభా పాటవాలు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులనే నియమిస్తున్నామని చెప్పారు.

04/20/2016 - 07:04

శ్రీ కాళహస్తి, ఏప్రిల్ 19: శ్రీ కాళహస్తి పట్టణంలో మంగళవారం అమానుషం వెలుగుచూసింది. పట్టణంలోని స్వర్ణముఖి నదిలో లగేజి బ్యాగులో సుమారు ఏడేళ్ల బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాగును తెరచి అవాక్కయ్యారు. సుమారు ఏడేళ్ల వయసున్న పిల్లవాడి మృతదేహాన్ని చూసి అక్కడున్నవారంతా చలించిపోయారు.

04/20/2016 - 07:05

భీమవరం, ఏప్రిల్ 19: వశిష్ట వారధి.... ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన బ్రిడ్జి. దీని నిర్మాణ ప్రతిపాదనలు మొదలై ఇప్పటికి 56 ఏళ్లు గడిచాయి. 1960లో దామోదర సంజీవయ్య మంత్రివర్గంలో గోదావరి జిల్లాలకు చెందిన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అల్లూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో వంతెన నిర్మాణ ప్రతిపాదనలు మొదలయ్యాయి.

04/20/2016 - 07:02

ఒంటిమిట్ట, ఏప్రిల్ 19: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. అంతకు ముందు ఉదయం మోహినీ అవతారంలో పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత సీతారామలక్ష్ముణుల విగ్రహామూర్తులకు అర్చకులు సుగంధ ద్రవ్యాలతో కూడిన స్వచ్ఛమైన నీటితో వేద మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకాలు నిర్వహించి, ఊంజల్ సేవ జరిపారు.

04/20/2016 - 04:01

విజయవాడ, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఇంటర్మీడియెట్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షలు జరిగిన 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి, ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటిలోనూ బాలికలే పైచేయి సాధించారు. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

04/20/2016 - 03:55

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 2019 నాటికి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య లేకుండా చేయడానికి 10 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని మంగళవారం కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.

04/20/2016 - 03:51

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న 30 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున వేతనం పెంచుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సబ్‌కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు వెల్లడించారు.

Pages