ఆంధ్రప్రదేశ్‌

బాలికలే టాప్ - ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఇంటర్మీడియెట్ ఫలితాలను ప్రకటించింది. పరీక్షలు జరిగిన 28 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించి, ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటిలోనూ బాలికలే పైచేయి సాధించారు. విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. అత్యధిక ఉత్తీర్ణత శాతంతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ఎంపిసీలో ప్రియాంక, రోషిణి టాప్
ఇంటర్ సెకండియర్ ఎంపిసిలో నెల్లూరు జిల్లాకు చెందిన చిలకల వెంకట ప్రియాంక (992 మార్కులు), విజయనగరం జిల్లాకు చెందిన వారణాసి రోషిణి (992) అత్యధిక మార్కులు సంపాదించారు. కడపకు చెందిన ప్రియాంక నెల్లూరు జిల్లా కళ్లూరిపల్లె నారాయణ కళాశాలలో ఇంటర్ చదివింది. ఆమె తల్లిదండ్రులు వెంకట సుబ్బయ్య, సుశీల ఇద్దరూ టీచర్లే కావడం విశేషం. రోషిణి విజయనగరం నారాయణ కళాశాలలో ఇంటర్ చదివింది. ఆమె తల్లిదండ్రులు వారణాసి శ్రీనివాసరావు, ఉషారాణి దంపతులు తమ కుమార్తె సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎంటెక్ చదవడం తన లక్ష్యమని ఈ సందర్భంగా రోషిణి ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పింది. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన బొడ్డు వౌనిక (991), చిత్తూరు జిల్లాకు చెందిన హరిప్రియ (991), విశాఖకు చెందిన వైష్ణవి (990), సాయి అర్చన (990), పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిజాముద్దీన్ (990) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
బైపిసిలో స్వరూప్, దివ్యశ్రీ ఫస్ట్
కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు బైపిసిలో వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించారు. ఇంద్రస్వరూప్ (991), ప్రదీప్ రెడ్డి (990), అలేఖ్య (989) మార్కులు సాధించారు. కాగా చిత్తూరు జిల్లాకు చెందిన కె. దివ్యశ్రీ కూడా 990 మార్కులు సంపాదించి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది.
అగ్రస్థానంలో బాలికలు
ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 4,11,941 మంది అభ్యర్థులు హాజరుకాగా 3,03,934 మంది (73.78 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,06,274 మంది హాజరుకాగా 1,57,665 మంది (76.43 శాతం) ఉత్తీర్ణత సాధిస్తే, బాలురు 2,05,667 మంది హాజరుకాగా 1,46,269 మంది (71.12 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్‌లో 4,67,747 మంది అభ్యర్థులు హాజరుకాగా 3,18,300 మంది (68.05) ఉత్తీర్ణత సాధించారు. 2,33,522 మంది బాలికలు హాజరుకాగా 1,68,353 మంది (72.09), బాలురు 2,34,225 మంది హాజరుకాగా 1,49,947 మంది (64.02) ఉత్తీర్ణత సాధించారు.
రెండింటిలోనూ కృష్ణా టాప్
ఇంటర్ ప్రథమ, ద్వితీయ రెండు సంవత్సరాల పరీక్షా ఫలితాల్లో కూడా జిల్లాల వారీగా విశే్లషిస్తే కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 81 శాతం ఉత్తీర్ణత శాతం ప్రథమ స్థానంలో ఉండగా, కేవలం 57 శాతంతో అనంతపురం 9వ స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో 72 శాతంతో విశాఖ, మూడో స్థానంలో 71 శాతంతో నెల్లూరు నిలిచాయి.
ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా ప్రథమ స్థానంలో నిలిస్తే, 65 శాతంతో కడప చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ స్థానంలో 78 శాతంతో నెల్లూరు, తృతీయ స్థానంలో 77 శాతంతో విశాఖ నిలిచాయి.
chitram...
1. ఎంపిసిలో 992 మార్కులు సాధించిన ప్రియాంక
2. ఎంపిసిలో 992 మార్కులు సాధించిన రోషిణి