ఆంధ్రప్రదేశ్‌

జీతాలు పెరిగాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్రంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న 30 వేల మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒక్కొక్కరికి 2500 రూపాయల చొప్పున వేతనం పెంచుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సబ్‌కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు వెల్లడించారు. మంగళవారం స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్థిక మంత్రి, కంట్రాక్విల్ ఎంప్లాయిమెంట్ సబ్ కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు అధ్యక్షతన కమిటీ సభ్యులు మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, కమిటీ కన్వీనర్, ఫైనాన్స్ సెక్రటరీతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సబ్ కమిటీ మొదటగా 60 వేల మందిని అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా గుర్తించామని అన్నారు. వీరిలో అంగన్‌వాడీలు, హోంగార్డులు ఉన్నట్లు తెలిపారు. కమిటీ సుదీర్ఘ చర్చల అనంతరం మూడు కేటగిరీలుగా విభజించామన్నారు. కేటగిరి 1లో 60 శాతం సిబ్బంది ఉన్నారని, వీరికి ఒక్కొక్కరికి నెలకు 6,700 చెల్లిస్తున్నట్లు, పెంచిన వేతనంతో 9,200 పొందుతారని చెప్పారు. కేటగిరి 2 కింద 30 శాతం మంది ఉన్నారని వీరిలో 8,400 పొందుతున్నారని, వీరు 10,900 పొందుతారన్నారు. కేటగిరీ 3లో 10 శాతం ఉన్నారని ప్రస్తుతం వీరు 11,500 పొందుతున్నారని, పెంచిన వేతనంతో 14,000 పొందుతారన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాల కింద రాష్ట్ర ప్రభుత్వం 380 కోట్లు చెల్లిస్తోందని, పెంచిన వేతనం 90 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ నుండి అమలులోకి వస్తాయని, ఏప్రిల్, మేలో పెరిగిన వేతనంతో పాటు జూన్ నుండి వేతనం ఇస్తామన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించే ఉద్దేశం లేదన్నారు. సిబ్బంది ఏ సర్వీసులో పనిచేస్తే ఆ సర్వీసులోనే కొనసాగిస్తామన్నారు. 1994 చట్టం అదే విధంగా సుప్రీంకోర్టు ఎటువంటి అభ్యంతరాలు లేని 1,003 పోస్టులను గుర్తించి వీరిని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. పోస్టులు లేని చోట్ల సూపర్ న్యూమనరీ పోస్టులు సృష్టించి భర్తీ చేస్తామన్నారు.

చిత్రం... మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి యనమల రామకృష్ణుడు