ఆంధ్రప్రదేశ్‌

గరుడ వాహనంపై రామయ్య ( ఒంటిమిట్టలో నేడు కల్యాణోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 19: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. అంతకు ముందు ఉదయం మోహినీ అవతారంలో పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత సీతారామలక్ష్ముణుల విగ్రహామూర్తులకు అర్చకులు సుగంధ ద్రవ్యాలతో కూడిన స్వచ్ఛమైన నీటితో వేద మంత్రోచ్ఛరణల మధ్య అభిషేకాలు నిర్వహించి, ఊంజల్ సేవ జరిపారు. అనంతరం రాములోరు గరుడ వాహనంపై ఆశీనులై భక్తకోటికి దర్శనమిచ్చారు. టిటిడి ఇఓ సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి వాహన సేవలు ప్రారంభించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్త సమూహం తండోప తండాలుగా తరలి వచ్చారు. ఇలాఉంటే 7వ రోజు బుధవారం సాయంత్రం శివ ధనుర్భాలంకారంతో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. రాత్రి 10 గంటల సమయంలో కల్యాణోత్సవ అనంతరం గజ వాహనంపై పురవీధులలో సీతారాములు భక్తకోటికి దర్శనమివ్వనున్నారు.
ఒంటిమిట్టలో బుధవారం జరిగే రామయ్య కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు టిటిడి ఇఓ సాంబశివరావు తెలిపారు. సుమారు లక్ష మంది భక్తులు హాజరైనా ఇబ్బందులు లేకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. అంతే కాకుండా భక్తబృందానికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకొన్నామన్నారు. భక్తులకు తలంబ్రాలు అందుబాటులో ఉండేందుకు 3 టన్నుల ముత్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచామని, కల్యాణం అనంతరం తలంబ్రాలతో కూడిన ముత్యాలు పంపిణీ చేస్తామన్నారు. అలాగే వెయ్యి మంది తమ సిబ్బంది కల్యాణోత్సవంలో భక్తులకు అందుబాటులో ఉంటారన్నారు. అదే విధంగా 7 లక్షల నీళ్ల ప్యాకెట్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల శుభ ఘడియలో ఆలయం నుండి సీతారాముల ఉత్సవమూర్తులను కల్యాణ వేదిక వద్దకు అట్టహసంగా తీసుకొస్తామన్నారు.