ఆంధ్రప్రదేశ్‌

10 వేల కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో 2019 నాటికి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య లేకుండా చేయడానికి 10 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని మంగళవారం కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. 2016-17లో చేపట్టిన పనులు పూర్తి చేయడానికే పది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఎన్‌ఆర్‌డిడబ్ల్యుపి కింద కేటాయింపులు మాత్రం 170 కోట్లు ఉన్నాయని కేంద్ర మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలు తీరుపై మంగళవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, జువల్ ఓరంతో కలిసి సిఎంవోలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో చేపట్టిన కరవు నివారణ కార్యాచరణపై అధికారులు కేంద్ర మంత్రిద్వయానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కరవు నివారణ కార్యాచరణలో భాగంగా పెద్దఎత్తున ఉపాధి హామీ పనులు, నీటి పథకాలు, రహదారుల నిర్మాణం చేపట్టినట్టు వివరించారు.
విభజన గాయం అలానే ఉంది
ఆశాస్ర్తియంగా అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరగడం వల్ల రాష్ట్రం అనేక కష్టాల్లో పడిందని, జనాభా 52 శాతం, ఆదాయం 45 శాతంగా ఉన్నందున చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు వివరించారు. విభజన చేసినవాళ్ళు న్యాయం ఎందుకు చేయారని ప్రజలు అడుగుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నిధుల విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రంపై ఉందని అన్నారు. మనం న్యాయం చేస్తామనే ప్రగాఢ నమ్మకంతోనే ప్రజలు అధికారం ఇచ్చారని, దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగబోదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి తగినంత సాయం అందించడానికి సిద్ధంగానే ఉందని ముఖ్యమంత్రికి చెప్పారు.
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఎపి చురుగ్గా ఉందని ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మంచినీరు, పారిశుద్ధ్య శాఖల మంత్రి చౌధురి బీరేంద్రసింగ్ ప్రశంసించారు. రాష్ట్రంలో వినూత్నంగా ఏర్పాటు చేసిన భూగర్భ జలాల నమోదు పరికరాల గురించి కేంద్ర మంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఎపిలో మాదిరి ఇతర రాష్ట్రాలలో కూడా ఫిజోమీటర్లను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఒక ఫిజోమీటర్ చొప్పున ఏర్పాటు చేసి రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. కేంద్ర మంత్రులకు అక్కడికక్కడే తన ఐప్యాడ్‌లో ఆ క్షణం వరకు ఉన్న భూగర్భ జల మట్టాల గణాంకాల్ని చూపించారు.

చిత్రం... కరవుపై కేంద్ర మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు