ఆంధ్రప్రదేశ్‌

మూడు నెలల్లో పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: జగన్ అక్రమాస్తుల కేసులో ఐఆర్‌ఎస్ అధికారి కెవి బ్రహ్మానందరెడ్డి పెట్టుకున్న పిటిషన్‌పై వచ్చే మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గురువారం సిబిఐ కోర్టును ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు జడ్జి జస్టిస్ రాజా ఎలాంగో జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో వాన్‌పిక్‌కు రాయితీపై భూములు కేటాయించడంపై జరిగిన ఎంఓయూలో ఈ అధికారి కీలకపాత్ర వహించారంటూ సిబిఐ అభియోగం మోపింది. కాగా తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేశారని ఐఆర్‌ఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇప్పటికే సిబిఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశానని ఆయన చెప్పారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం నుంచి మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.