ఆంధ్రప్రదేశ్‌

ఏపిని కేంద్రమే ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 21: రాజకీయ స్వలాభం కోసం అడ్డదిడ్డంగా రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అధోగతి పాలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నేడు అధికారంలోకి వచ్చినందున విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కడపలో గురువారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు. అప్పులను జనాభా ప్రాతిపదికన పంచినందున, అదే ప్రాతిపదికన కేంద్రం ఉదారంగా నిధులు విడుదల చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. రాష్ట్ర విభజన ముందు జనాభా విషయానికివస్తే ఆంధ్రలో 58శాతం, తెలంగాణలో 42 శాతం ఉండగా, ఆదాయం మాత్రం తెలంగాణకు 50.65 శాతం, ఏపికి 49.35శాతం చొప్పున ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలతోపాటు ప్రభుత్వానికి అనేక రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ చెప్పుకోతగ్గ పరిశ్రమలు ఏమీ లేవన్నారు. ఇకపోతే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయమై కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్టు చెప్పారు. బ్రహ్మణి స్టీల్స్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలచే ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు చర్యలు వేగవంతం చేసినట్టు చెప్పారు. ఇక నదుల అనుసంధానం విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గోదావరి, కృష్ణానదులను అనుసంధానం చేసేందుకు శ్రీకారం చుట్టామని , పట్టిసీమకు పూర్తిస్థాయిలో నీరు అందితే పెన్నా- సోమశిల ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుగంగ , హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులు పూర్తయితే కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు సమస్య ఉండదని గుర్తు చేశారు. ఇక నీరు-చెట్టు ప్రగతిపై అధికారులు , ప్రజలు దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయం భారతదేశంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తయారైందన్నారు. కడప అమీన్ పీర్ దర్గా, గండికోట తదితర దేవాలయాలతోపాటు ఒంటిమిట్ట దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మార్చి పూర్వవైభవం తెస్తామన్నారు. ఇక కడప నూతన కలెక్టరేట్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సిఎం కలెక్టర్‌ను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమపథకాలకు కానీ, ప్రభుత్వాదాయానికి కానీ గండికొట్టేందుకు ప్రయత్నించే వారిపైనా, అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిఎం వెంట రాష్టమ్రంత్రులు గంటా శ్రీనివాసరావు తదితరులున్నారు.