ఆంధ్రప్రదేశ్‌

హిందూమత టూరిజం డైరెక్టర్‌గా రత్నకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో హిందూమత టూరిజం విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి డైరెక్టర్‌గా వి.రత్నకుమార్‌ను నియమిస్తూ రెవెన్యూ (ఎండోమెంట్స్) ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిలీజియస్ టూరిజం డైరెక్టర్‌గా రత్నకుమార్ మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈయనకు వేతనంతో పాటు ఇతర అలవెన్సుల కింద నెలకు లక్ష రూపాయలు చెల్లించేందుకు నిర్ణయించారు. కామన్ గుడ్ ఫండ్ (సిజిఎఫ్) నుండి ఇందుకోసం నిధులను వినియోగిస్తారు. ఏడాది తర్వాత రత్నకుమార్ పనితీరు బాగా ఉన్నట్టు తేలితే ఏటా 10 శాతం వేతనాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ విధంగా రెండేళ్లపాటు వేతనం పెరుగుతుంది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధీనంలోని సిజిఎఫ్ నుండి వేతనం చెల్లించినప్పటికీ, రత్నకుమార్ నేరుగా రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనంలో పనిచేస్తారు. పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆయన సర్వీసు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని దేవాలయ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన దేవాలయాలకు భక్తులు, పర్యాటకులు వెళ్లేందుకు, రవాణా తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికలను రత్నకుమార్ రూపొందిస్తారు. పర్యాటక శాఖ, ఎపి పర్యాటక అభివృద్ధి సంస్థ, డైరెక్టర్ ఆర్కియాలజీ శాఖల సమన్వయంతో రత్నకుమార్ పనిచేస్తారు.