ఆంధ్రప్రదేశ్‌

మే 2న వైకాపా కరవు ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపిలో కరవు పరిస్థితులు నెలకొన్నా ఎలాంటి సహాయక చర్యలు తీసుకోనందుకు నిరసనగా వచ్చే నెల 2న అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు జరపాలని, ఖాళీ బిందెలతో ఆందోళనలు నిర్వహించాలని వైకాపా నిర్ణయించింది. పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో వైకాపా అధినేత వైఎస్ జగన్ మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తాగునీటిని, సాగునీటిని అందించడంలో ఎపి సర్కారు తీవ్ర వైఫల్యం చెందిందని జగన్ విమర్శించారు. కాగా, అధికార టిడిపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా రాష్టవ్య్రాప్తంగా ఈనెల 25న కొవ్వొత్తుల ర్యాలీలు జరపాలని నిర్ణయించారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని కోరుతూ మే నెల తొలివారంలో దిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.