ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18 : ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయితీల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు ఈ నెల 29, 30 తేదీలలో ఉపఎన్నికలు నిర్వసించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్, సామర్లకోట మున్సిపాలిటీ వైస్-చైర్మన్ పోస్టులకు 29 న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అలాగే గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి అనంతపురం జిల్లా అమరాపురం ఎంపిపి, గుంటూరు జిల్లా వినుకొండ ఎంపిపి అధ్యక్ష స్థానాలకు కూడా అదేరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం, ప్రకాశం జిల్లా కొరిసపాడు, విశాఖపట్నం జిల్లా మునగపాక, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి, కడప జిల్లా మైదకూరు, వేముల, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల ప్రజాపరిషత్తు ఉపాధ్యక్ష స్థానాలకు కూడా ఏప్రిల్ 29 న ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఈ నోటిఫికేషన్‌లో వివరించారు. ఇలా ఉండగా 75 గ్రామపంచాయితీల్లో ఉపసర్పంచ్ స్థానాలకు ఈ నెల 30 న ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.