S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/16/2016 - 14:30

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు శనివారం సింగరాయకొండలో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను ఆరా తీశారు. అనంతరం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ జలవనరులను సంరక్షించేందుకు దీక్ష వహించాలన్నారు.

04/16/2016 - 14:30

విజయవాడ: దివంగత నేత ఎన్టీఆర్ అలనాడు సేవాభావంతోనే తెలుగుదేశం పార్టీని ప్రారంభించారని, ఆయన చూపిన బాటలో పార్టీ శ్రేణులు ప్రజాసేవలో తరించాలని ఎపి సిఎం చంద్రబాబు సూచించారు. ఆయన శనివారం ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సేవాభావంతోనే రాజకీయాల్లో కొనసాగాలని, వాణిజ్య దృక్పథంతో కాదని అన్నారు.

04/16/2016 - 12:42

విజయవాడ: మద్యం విషయమై ఇక్కడి సూర్యారావుపేట ప్రాంతంలో శనివారం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఓ నిండు ప్రాణం బలైంది. ఖమ్మం జిల్లాకు చెందిన మల్లికార్జున్ అనే వ్యక్తి తలపై మరో వ్యక్తి బండరాయితో మోదాడు. దీంతో మల్లికార్జున్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

04/16/2016 - 12:41

విశాఖ: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్)లోని బ్రాండిక్స్ కంపెనీలో ఆందోళన చేస్తున్న మహిళా కార్మికులు శనివారం తమ నిరసన దీక్షను విరమించారు. జీతాల పెంపుదల, పిఎఫ్, ఇతర సౌకర్యాల విషయంలో హామీలను అమలు చేసేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు.

04/16/2016 - 12:40

విజయవాడ: కృష్ణా జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకుని 8 లక్షల రూపాయల దొంగనోట్లను, 50 వేల నగదును, 3 బైక్‌లు, 18 సెల్‌ఫోన్లను శనివారం స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వీరు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా వీరు ఎపిలోకి ప్రవేశించి నకిలీ కరెన్సీని పలువురికి అంటగడుతున్నారు.

04/16/2016 - 12:37

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపు మండలాలను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ శనివారం ఇక్కడ మీడియాకు చెప్పారు. గోదావరి, కృష్ణా నదులపై మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై రెండు తెలుగురాష్ట్రాలూ ఉమ్మడిగా పోరాటం చేయాల్సి ఉందన్నారు.

04/16/2016 - 08:12

ఒంగోలు, ఏప్రిల్ 15:రాష్ట్రప్రభుత్వం ఇకనుండి డికె పట్ట్భాముల్లోను రొయ్యల,చేపల పెంపకం చేపట్టే విధంగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపధ్యంలో రాష్టవ్య్రాప్తంగా మత్స్యసంపద భారీగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం ఆ మేరకు 128జివోను ఈనెల 4న విడుదల చేయటంతో డికెపట్టాల్లో అధికారికంగా రొయ్యల, చేపలసాగును రైతులతోపాటు, పారిశ్రామికవేత్తలు చేసుకోనున్నారు.

04/16/2016 - 08:11

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 15: రాష్ట్రంలో ఇసుక సమృద్ధిగా లభించే ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా. గోదావరి నది ఇసుకకు నిర్మాణ రంగంలో మరింత డిమాండ్ ఉంది. ఇక్కడ ఇసుక గతంలో నౌకలపై విదేశాలకు సైతం ఎగుమతైంది. ఇదికాస్త పక్కన పెడితే... ఉచిత ఇసుక విధానం మాఫియా చేతిలోకి వెళ్లిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదొక సదవకాశంగా పరిణమించిందని తెలుస్తోంది.

04/16/2016 - 05:21

విజయవాడ, ఏప్రిల్ 15: కృష్ణమ్మ ఆవిరైంది.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలన్నీ నీటి ఎద్దడితో కటకటలాడుతున్నాయి. నది ఎగువ ప్రాంతంలో నీరు లేకపోవడంతో దిగువ ప్రాంతాలన్నీ నీటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని అన్ని రిజర్వాయర్లలో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం శనివారం నాటికి డెడ్ స్టోరేజ్‌కు చేరుకోబోతోంది.

04/16/2016 - 05:12

విజయవాడ, ఏప్రిల్ 15: ‘నేను నిద్రపోను.. మిమ్నల్ని నిద్రపోనివ్వను’ అని పదే పదే అధికారులను హెచ్చరించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మాటల్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు బేజారవుతున్నారు. ‘పేరుకే సెలవలు...మాకన్నీ పని దినాలే’నంటూ వాపోతున్నారు. 14వ తేదీ అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి కాబట్టి, రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగులంతా గురువారం విధులకు హాజరయ్యారు. శుక్రవారం శ్రీరామ నవమి.

Pages