ఆంధ్రప్రదేశ్‌

బ్రాండిక్స్ వద్ద కార్మికుల బైఠాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అచ్యుతాపురం వద్ద బ్రాండిక్స్ సెజ్ వద్ద మహిళా కార్మికులు సోమవారం ఉదయం బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జీతాలు పెంచాలని, పిఎఫ్‌ను సక్రమంగా జమ చేయాలని తదితర డిమాండ్లను తీర్చకుంటే తాము విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధులతో అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రమేష్‌బాబు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 15 రోజుల్లోగా డిమాండ్లను పరిష్కరిస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు చెప్పగా, తక్షణం సమస్యలను పరిష్కరించాలని కార్మికులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.