ఆంధ్రప్రదేశ్‌

పేద బ్రాహ్మణులకు అంత్యోదయ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (టౌన్), ఏప్రిల్ 17: రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకునేందుకు అంత్యోదయ పథకాన్ని ప్రారంభించనున్నామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు కూరెళ్ల పరమేశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన బ్రాహ్మణ చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రాహ్మణులు ఎన్నో త్యాగాలు చేసారని, అయితే ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణులు నెగ్గుకురావాలంటే రాజకీయంగా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికలలో బ్రాహ్మణ సమాజానికి ఆయా పార్టీలు ఇచ్చిన హామీల అమలు కోసం సమాఖ్యలు ప్రజాస్వామ్యబద్ధంగా అడగాల్సిన అవసరం ఉందని గుర్తుచేసారు. టిడిపి మ్యానిఫెస్టోలో మీ-కోసం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఆయన ప్రస్తావిస్తూ వాటి అమలుకోసం అడిగే హక్కు ఉందని చెప్పారు. బ్రాహ్మణ సమాజం బీదదికాదని, కానీ బ్రాహ్మణులలో కొంతమంది బీదలు ఉన్నారని వారిని అన్ని విధాల ఆదుకోవడానికి కార్పొరేషన్ అమలుచేస్తున్న పథకాలు వివరించిన ఆయన త్వరలో అంత్యోదయ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. బ్యాంకు లింకేజ్ ద్వారా సబ్సిడీ రుణాలను సమాజానికి అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఐదువందల కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ కార్యాచరణలో భాగంగా గత ఏడాది 60కోట్లు, ఈ ఏడాది 65కోట్లు కేటాయించారని తెలిపారు. నిధులు పూర్తిస్థాయిలో వినియోగిస్తే మరింతగా కార్పొరేషన్‌కు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జిల్లా బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు కెపి ఈశ్వర్ మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజం సంఘటితంగా ఉంటేనే సమాజంలో అవకాశాలు అందిపుచ్చుకుని భవిష్యత్‌ను నిర్మించుకోగలుగుతామని అన్నారు. టిడిపి నాయకుడు పేరి రామయ్య మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణులు కార్పొరేషన్ ద్వారా పథకాలను అందిపుచ్చుకోవాలని కోరారు. అనంతరం గరివిడికి చెందిన సూర్యపీఠం నిర్వాహకులు సద్గురు సోమయాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును, బ్రాహ్మణ ప్రముఖులను సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్య అధ్యక్షుడు శ్రీకాంత్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శి నారాయణ శర్మ, పట్టణ కార్యదర్శి భరద్వాజ చక్రవర్తి, ఎఐబి ఫెడరేషన్ అధ్యక్షులు కోట శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు

వటపత్రశాయి అలంకారంలో ఒంటిమిట్ట రామయ్య

సింహ వాహనంపై దర్శనమిచ్చిన దేవదేవుడు

ఒంటిమిట్ట, ఏప్రిల్ 17: ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం ఉదయం దేవదేవుడు వటపత్రసాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎండలను సైతం లెక్కచేయకుండా భక్తులు రావడంతో ఆలయమంతా రామనామ స్మరణతో మార్మోగింది. సాయంత్రం స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. తిరుపతికి చెందిన ప్రముఖ గాయని ఆలపించిన సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రామయ్య నవనీత కృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి రామయ్యకు ప్రియశిష్యుడైన హనుమంతుని వాహనంపై శ్రీసీతారామలక్ష్మణులు పురవీధుల్లో ఊరేగనున్నారు.

నేడు సింహాచలేశుని
కల్యాణం, రథోత్సవం
సింహాచలం, ఏప్రిల్ 17: కృతయుగ దైవంగా సింహగిరి శిఖరాన కొలువుదీరిన శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవం సోమవారం వైభవంగా జరగనుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం స్వామి వారి కల్యాణం నిర్వహించేందుకు వైదిక పెద్దలు సన్నద్ధమవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు దర్శనాలు నిలిపివేసి కొట్నాల ఉత్సవం నిర్వహిస్తారు. 5 గంటల 45 నిముషాలకు ధ్వజారోహణం అనంతరం ఎదురు సన్నాహ వేడుకలు చేస్తారు. కల్యాణ మూర్తులను రథంపై అధిష్టింపజేసి దేవాలయ సంప్రదాయం ప్రకారం అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులతో అధికారులు తొలి దర్శనం చేయిస్తారు. ఈ ఏడాది ధర్మకర్త హోదాలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు టెంకాడ కొట్టి రథోత్సవం ప్రారంభిస్తారు.
శ్రీమహాలక్ష్మీ సముద్రరాజ తనయ కావడంతో గంగపుత్రులైన జాలర్లు వధూవరులను కల్యాణ వేదికకు తోడ్కొని వెళ్లే బాధ్యత వహిస్తారు. ఈ నేపధ్యంలోనే రథయాత్ర జరుగుతుంది. కల్యాణం, రథోత్సవం సందర్భంగా ఈవో రామచంద్రమోహన్ నేతృత్వంలో దేవస్థానం అన్ని ఏర్పాటు చేసింది. జివిఎంసి, పోలీస్, ఆర్టీసీ ఆరోగ్య, అగ్నిమాపక, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమై సహకారం కోరారు. రథాన్ని ఆర్ అండ్ బి అధికారులు తనిఖీ చేసి ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ ఇచ్చారు. 12 వేల ముత్యాల తలంబ్రాలు భక్తులకు పంపిణీ చేసేందుకు దేవస్థానం సిద్ధం చేసింది. 3500 మందికి అన్నప్రసాదం సిద్ధం చేస్తున్నారు. కల్యాణం ప్రత్యక్షంగా చూసేందుకు సింహగిరిపై స్క్రీన్‌లు ఏర్పాటుచేస్తున్నారు. రాత్రి 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచుతామని డిఎం దివ్య చెప్పారు. కల్యాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిసిపి పర్యవేక్షణలో గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో వడదెబ్బకు
నలుగురు మృతి
విశాఖపట్నం, ఏప్రిల్ 17: ఉత్తరాంధ్రలో ఆదివారం ఎండ తీవ్రతను తట్టుకోలేక నలుగురు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన ఆంజనేయులు (65), విజయనగరం జిల్లా వేపాడ మండలం చినబూడిపాలెం గ్రామానికి చెందిన వంతాపు భీముడు (56), విశాఖ జిల్లా రావికమత మండలం ఒమ్మివరం గ్రామానికి చెందిన నమ్మి అప్పారావు (45), విశాఖ నగరం గోపాలపట్నం ప్రాంతానికి చెందిన రిక్షా కార్మికుడు రాపేటి చిన్నోడు (55) మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతి
ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మేరిగపూడి గ్రామానికి చెందిన రైతు ఆళ్ల రమణారెడ్డి (65) పొలం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. బంధువులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తుండగా శనివారం రాత్రి మృతిచెందాడు.
పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరులో ట్రాఫిక్ ఐలాండ్ సెంటర్ జిబిసి రోడ్డు మార్జిన్‌లో గొడుగు ఆసరాతో చెప్పులు కుట్టుకుని జీవించే చర్మకారుడు ఇళ్ల సుగుణరావు (45) వడదెబ్బకు గురై ఆదివారం మృతిచెందాడు. రెండు రోజులుగా వీస్తున్న వడగాల్పుల తీక్షణకు శనివారం సుగుణరావు వడదెబ్బకు గురయ్యాడు. సెలైన్ బాటిళ్లను ఎక్కించినప్పటికీ ఫలితంలేక ఆదివారం వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందాడు.
వౌలిక వసతులు, శిక్షణ లేకుండా
పనిచేయడం కష్టమే
ఎపి రెవెన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు
రేణిగుంట, ఏప్రిల్ 17: రాష్ట్రంలో రెవెన్యూ విభాగం అభివృద్ధి కావాలంటున్న ప్రభుత్వం సిబ్బంది కొరత తీర్చకుండా, వౌలిక వసతులు కల్పించకుండా, శిక్షణలు ఇవ్వకుండా ఎలా సాధ్యమవుతుందో పాలకులు చెప్పాలని ఎపి రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరులు అన్నారు. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట ఎంపిడివో కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. రెవెన్యూ సిబ్బంది నిత్యం ప్రజల్లో మమేకమై ఉంటారన్నారు. ఈ క్రమంలో తగిన వౌలిక వసతులు, సిబ్బంది కొరత తీర్చడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో తాము విమర్శల పాలు కావాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూశాఖ నుంచి అన్ని రకాల నివేదికలు కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తాయన్నారు. కిందిస్థాయి సిబ్బంది లేకపోవడంతో అది ఎలా సాధ్యమో పాలకులకు తెలియాలన్నారు. రెవెన్యూశాఖలో 30ఏళ్లుగా ఖాళీల భర్తీ జరగలేదన్నారు.ప్రొటోకాల్ విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసినా కలెక్టర్ల జాప్యం వల్ల నిధులు తహశీల్దార్లకు అందలేదన్నారు. తగు శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ట్యాబ్‌లు ఇచ్చినా అవి నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. కింది స్థాయి సిబ్బంది నియామకాలు లేకపోవడం వల్ల అడిగినవారికి తగిన సమాచారం ఇవ్వలేని పరిస్థితుల్లో ఆర్టీఏ కార్యాలయం చుటూ తహశీల్దార్లు తిరగుతూ మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. తహసీల్దార్లకు వాహనాల మంజూరు సంగతి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు.

భద్రాద్రి రామునికి
సదస్యం
వేద మంత్రోచ్చారణలతో
పండితుల మహదాశీర్వచనం
భద్రాచలం, ఏప్రిల్ 17: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణ రాముడికి మహదాశీర్వచనం(సదస్యం) జరిగింది. సుమారు 100 మందికి పైగా వేదపండితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ముందుగా స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన, బాలభోగ నివేదన, హవనం, సేవాకాలం, బలిహరణం, మంగళాశాసనం చేశారు. మూలవరుకు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్వామికి సువర్ణ పుష్పార్చన జరిగింది. ఆరాధన అనంతరం రాజభోగం సమర్పించారు. తర్వాత వేదస్వస్తి చెప్పారు. సాయంత్రం స్వామికి మహదాశీర్వచనం, వేదసాహిత్య సదస్సు నిర్వహించారు. హంసవాహనంపై స్వామికి తిరువీధి సేవ జరిగింది.

వైభవంగా అరసవిల్లి
ఆదిత్యుని కల్యాణం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఏప్రిల్ 17: కర్మసాక్షి కొలువైన పుణ్యక్షేత్రం అరసవిల్లిలో శ్రీసూర్యనారాయణస్వామివారి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. చైత్రశుద్ధ ఏకాదశి సందర్భంగా ఉషాపద్మిని ఛాయ సమేత సూర్యనారాయణస్వామి వారి ఉత్సవ మూర్తులను అనివెట్టి మండపంలో కొలువుతీర్చి ఇప్పిలి శంకరశర్మ సారథ్యంలోని అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. తొలుత సప్తాశ్వ, అశ్వవెండి వాహనాలపై ఆదిత్యుడు, దేవేరులకు ఆలయమాడ వీధుల్లో తిరువీధి ఘనంగా నిర్వహించారు.