S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

05/28/2018 - 23:42

ఇదొక ఇండోర్ గేమ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఆటను ఎక్కువగా ఆడపిల్లలు ఆడుతుంటారు. ఒక్కోసారి మగపిల్లలు, పెద్దవాళ్లు కూడా ఆడుతారు. పెద్దవాళ్లు అయితే ఇద్దరు కోడళ్లున్న అత్తగారు ఆడుతారు. ఒక్కకోడలున్నా అత్తతో కలసి ఆడుకునేవారుంటారు.

05/28/2018 - 23:42

శ్రీరంగనీతులు
తాము ఆచరింపక ఇతరులకు చెప్పు నీతులు
ఓడలు బండ్లగు, బండ్లు ఓడలగు
సంపదలు అస్థిరములగుట చేత ధనికులు బీదలుగా, బీదలు ధనికులుగా మారుట
కాకతాళీయము
అప్రయత్నముగా కలుగు సందర్భము
ఈకకు ఈక, తోకకు తోక
ఏ భాగమునకు ఆ భాగము విడివిడిగా..

05/28/2018 - 23:40

అక్కఱపాటువచ్చు సమయంబునఁ జుట్టములొక్క రొక్కరి
న్మక్కువనుద్ధరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమే సుమీ
యొక్కట నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలన్
దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!
- అక్కర వచ్చినపుడు బంధువులు, మిత్రులు ఒకరికొకరు సాయపడవలెను. అవి ఎట్లన పడవలు బండ్ల మీదను, పడవల మీద బండ్లును సమయము వచ్చినపుడు కనిపించు రీతిగా.

05/22/2018 - 02:18

చిన్నచిన్న పిల్లలం
మల్లెపూల మొగ్గలం
మల్లెపూల మొగ్గలం
రంగురంగుల ముగ్గులం
ప్రకృతి అందాలు చూద్దామా
పరవశించి గంతులేద్దామా

స్వాతివాన చినుకుల్లో
మనము ఒక చినుకౌదాం
సీతాకోక చిలుకల్లో
మనము ఒక చిలుకౌదాం
సిరివెనె్నల చంద్రులౌదమా
వెనె్నల్లో సంద్రవౌదమా

05/22/2018 - 02:16

తల్లులు పిల్లలకి
బువ్వ తినిపించేటప్పుడు పడే పాట్లు
కాకీ, కాకీ, హోష్
కాకీ, కాకీ, రాకే రాకే
పాపాయి బువ్వ తింటోంది
కాకీ, కాకి హోష్

వెండి గినె్నలో పప్పు బువ్వా
గుంజు, గుంజు గుంజు గుంజు
గోరు, గోరు, గోరు, గోరు

కంచం అంచునరాసే
గోరు గుజ్జూ తీసీ
గుజ్జూ నోటికి పూసీ
బుజ్జీ నోట ఆం

05/22/2018 - 02:15

పరిమళదేశాన్ని ప్రతాపవర్మ అనే రాజు పాలించేవాడు. అతడు విశ్రాంతిగా ఉన్నప్పుడు పండిత చర్చ చేసేవాడు. తన ఆస్థానంలోని పండితులనూ, ఆస్థాన ఉద్యోగులనూ మంత్రి మండలినీ అందరినీ ఆహ్వానించేవాడు. అందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం ఇచ్చేవాడు.
ఒకమారు ప్రతాపవర్మ అలా ఇష్టాగోష్టిలో ఆ సభలో మాట్లాడుతూ ‘‘పండిత వరులారా! మానవున్ని అన్నింటికంటే పట్టి పీడించే గుణమేది?’’ అని అడిగాడు.

05/22/2018 - 02:12

కోపం మనసులో కాదు
మాటలో మాత్రమే ఉండాలి.
ప్రేమ మాటలో మాత్రమే కాదు
మనసులో కూడా ఉండాలి.

05/22/2018 - 02:12

మనుషులకు ముక్కుమీద కోపం ఉంటే,
దీని ముక్కు మీద కొమ్ము ఉంటుంది
రౌడీలు కత్తిని చేతిలో పట్టుకుంటే
ఇది కత్తిని తన పేరులో పెట్టుకుంది!
... ఇంతకీ ఏమిటది?

జవాబు:
ఖడ్గమృగం
*

05/22/2018 - 02:11

అతిగుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేకయుండినన్
మితముగఁగాని కల్మిగల మీఁదట నైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద, నేఱులు నిండి పాఱినన్
గతుకగఁజూచుఁ గుక్కదనకట్టడ మీఱకయెందు భాస్కరా!
లోభి తన శరీరము, సంపద శాశ్వతమనుకొని మితముగానే తినును గాని అతిగా తినడు. కుక్కలు నదుల నిండ నీరున్నను నాలికతో తాగునే గాని బాగుగా తాగవు. లోభిని, కుక్కతో పోలుస్తున్నాడు ఈ శతకకారుడు.

05/22/2018 - 02:10

కంటి నుండి బాధ కలిగినప్పుడు దుఃఖం సంభవించినప్పుడు వచ్చే నీటిని కన్నీరంటారు. మున్నీరంటే సముద్రపునీరు. ఈ రెంటి నీటి లోపలా ఒకే గుణమున్నది. కన్నీటిలోను ఉప్పు ఉంటుంది. మున్నీటిలో ఉప్పు ఉంటుంది. అయితే మున్నీరు అపార పరీవారము అంటే ఎక్కువ ‘‘ ఆమె తన భర్త చనిపోతే కన్నీరుమున్నీరుగా ఏడ్చింది’’ అని అంటే ఎక్కువగా దుఃఖించిందని, ఎడతెరపి లేకుండా దుఃఖించిందని అర్థము.
కంకణము కట్టుకొను:

Pages