బాల భూమి
చిన్నారులం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 May 2018

చిన్నచిన్న పిల్లలం
మల్లెపూల మొగ్గలం
మల్లెపూల మొగ్గలం
రంగురంగుల ముగ్గులం
ప్రకృతి అందాలు చూద్దామా
పరవశించి గంతులేద్దామా
॥
స్వాతివాన చినుకుల్లో
మనము ఒక చినుకౌదాం
సీతాకోక చిలుకల్లో
మనము ఒక చిలుకౌదాం
సిరివెనె్నల చంద్రులౌదమా
వెనె్నల్లో సంద్రవౌదమా
॥
జామచెట్ల తోటలోన
రామచిలుక మనవౌదాం
జాజిపూల చెట్టుకింద
బావిగిలక మనవౌదాం
నిమ్మపూల వాసనౌదమా
నింగిలోన మేఘవౌదమా
॥
కృష్ణానదిని చుట్టుముట్టు
దట్టమైన అడవౌదాం
గోదావరి నది ఒడిలో
పాడుతున్న పడవౌదాం
మన ఊరి చెరువౌదమా
చెరువులోని చేపౌదమా
॥