బాల భూమి

దుష్టులకు దూరంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందేలు చెట్టుపైకి ఆశగా చూడటం చూసిన కాకి సగం తిన్న జామపండును జారవిడిచింది.
ఆ జామపండును ఇష్టంతో తింటూ ‘‘కాకి మామా నీ సహాయం ఎన్నటికీ మరువలేను. నా కోసం ఎక్కడో దొరికిన పండ్లను తీసుకొని వచ్చి ఇస్తున్నావు నీ ఋణం ఎలా తీర్చుకొంటానో’’ అంది కుందేలు.
‘‘ఋణం అన్నావు కాబట్టి చెబుతున్నాను. నాకు ఉడుత మాంసం తినాలని కోరిక కలిగింది. గ్రద్దలాగా వేటాడి పట్టలేను. నన్ను చూస్తూనే మెరుపులా తప్పించుకొంటుంది.’’
తీయటి జామపండు తింటున్న మైకంలో స్నేహం నటిస్తున్న కాకి దుష్టబుద్ధిని గుర్తించలేకపోయింది. దుష్ట స్నేహం వల్ల కుందేలులోనూ వక్రబుద్ధి ప్రవేశించింది.
‘‘నాకొక ఉడుతతో పరిచయం ఉంది. నేను దానితో దాగుడుమూతలాట ఆడుతాను. సమయం చూసి నీవు పట్టుకో’’ అంది.
‘‘మంచి ఆలోచన. ఈ రోజు అంతా నీ కనుచూపులోనే ఏదో ఒక చెట్టు మీద ఉంటాను’’ అంది కాకి.
కుందేలు ఉడుత ఉన్న చోటుకి వెళుతుంది. ఉడుతతో కాసేపు మాట్లాడిన తరువాత ‘‘దాగుడుమూతల ఆట ఆడుకుందామా’’ అంది.
‘‘అక్కడే ఉండి కళ్లు మూసుకొని పది సార్లు వేగంగా అరవకుండా మెల్లగా అరిచిన తరువాత కళ్లు తెరచి నన్ను వెతికి పట్టుకోవాలి’’ అంది కుందేలు.
ఉడుత కళ్లు మూసుకోగానే చెట్టుపై నున్న కాకికి సైగ చేసింది. ఉడుత కళ్లు మూసుకొని కిచ్‌కిచ్‌మంటూ చెప్పడం ప్రారంభించగానే చెట్టుపై నున్న చిన్న ఎండుకొమ్మ గాలికి ఉడుతపై పడగానే కళ్లు తెరచింది. తన వైపు వస్తున్న కాకిని చూడగానే ఒక్కసారిగా పరుగెత్తి తప్పించుకొంది.
కుందేలు, కాకి కలసి చేసిన మోసం ఉడుత గుర్తించలేదు. మరలా కాకి వస్తుందన్న భయంతో ఉడుత ఆడుకోడానికి అంగీకరించలేదు. కాకి నిరుత్సాహంతో వెళ్లిపోయింది.
జరిగిన సంఘటన తల్లితో చెబుతూ ‘‘నేను పొరపాటు చేసినా అదృష్టవశాత్తు ఆ ఉడుత తప్పించుకొంది. ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యనమ్మా’’ అంది కుందేలు.
‘‘దుష్టులతో స్నేహం చెయ్యకూడదు. దుష్టులకు దూరంగా ఉండాలి’’ అంది తల్లి.
‘‘నాకు హాని చేయగల శక్తి ఆ కాకికి లేదు. అయినా నా జాగ్రత్తలో నేను ఉంటానమ్మా’’ అంది ఉడుత.
ఒకరోజు కాకి ఇచ్చిన పండు తింటున్న సమయాన ఎదురుచూడని విధంగా నక్క తనపై వస్తుండటం గమనించి పొదలో ఎగిరి దూకింది కుందేలు.
నక్క ఆ పొదలోనికి వెళ్లలేకపోయింది.
‘‘నన్ను క్షమించు కాకి మామా. ఒక్క అడుగులో తప్పించుకొంది. దొరికితే కుందేలును మనమిద్దరం తిని ఉండవచ్చు’’ బాధగా అంది నక్క.
కాకి అసలు రూపాన్ని గుర్తించింది కుందేలు.
అమ్మ చెప్పినట్లు దుష్టులతో స్నేహం చెయ్యకూడదు. దుష్టులకు దూరంగా ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకుంది కుందేలు.

-ఓట్ర ప్రకాష్