భాస్కర శతకం
Published Tuesday, 22 May 2018అతిగుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేకయుండినన్
మితముగఁగాని కల్మిగల మీఁదట నైన భుజింప డింపుగా
సతమని నమ్ము దేహమును సంపద, నేఱులు నిండి పాఱినన్
గతుకగఁజూచుఁ గుక్కదనకట్టడ మీఱకయెందు భాస్కరా!
లోభి తన శరీరము, సంపద శాశ్వతమనుకొని మితముగానే తినును గాని అతిగా తినడు. కుక్కలు నదుల నిండ నీరున్నను నాలికతో తాగునే గాని బాగుగా తాగవు. లోభిని, కుక్కతో పోలుస్తున్నాడు ఈ శతకకారుడు.