S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

12/15/2018 - 18:29

ఒక అడవిలో పెద్ద వేపచెట్టు ఉండేది. దాని మీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకొని వుండేవి. వాటిలో ఒక కాకి వుండేది. దానికి చాలా పొగరు. ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది. చిన్నచిన్న పక్షులను ముక్కుతో పొడిచి, గోళ్లతో రక్కి ఏడిపించేది. దాంతో దాన్ని ఏవీ పలకరించేవి కాదు. మాటలు కలిపేవీ కాదు. దూరదూరంగా వుండేవి.

12/08/2018 - 19:35

గురుకులంలోని శాండిన్యుడు వద్ద అక్షయ, మురారి అనే ఇద్దరు రాజకుమారులు శిష్యరికం చేస్తున్నారు. శాండిన్యుడు ఇద్దరికీ అనేక విద్యాబుద్ధులు, యుద్ధ విద్యలు నేర్పిస్తున్నాడు. ఇద్దరిలో మురారి కొంచెం పిరికివాడిగా ఉన్నట్టు శాండిన్యుడు గమనించాడు. ఏది ఏమైనా మురారికి కూడా ధైర్య సాహసాలు అబ్బేట్టు చేయాలని నిశ్చయించుకొన్నాడు.

12/01/2018 - 22:05

నీలేష్ బడి నుంచి రాగానే టీవీ ముందో, కంప్యూటర్ ముందో, అదీ లేదంటే ఏ ఐపాడో పట్టుకుని ఆడుకుంటూ కూర్చునేవాడు. రాన్రాను బయటకు వెళ్లి ఆడుకునే ఆటలకన్నా ఆన్‌లైన్ గేమ్‌ల మీదే ఆసక్తి ఎక్కువై పోయింది.

11/24/2018 - 19:15

మాధవాపురంలో గొప్ప ధనవంతుడు గోపాలయ్య. అతడికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. రాబడి చాలా ఎక్కువగానే వస్తుంది. ఐనా పిల్లికి బిచ్చం పెట్టడు. ఎంగిలి చేత్తో కాకిని అదిలించడు. కడుపు నిండా తినటం తప్ప కడుపుకాలే వారికి పిడికెడు అన్నం పెట్టిన పాపాన పోడు. అతడి ఇంటికి ఊరి వారి రాకపోకలూ తక్కువే. బిచ్చగాళ్లు ఇంటి ముందు కనిపిస్తే చాలు నానా తిట్లూ తిడుతూ కర్ర పట్టుకు వచ్చి తరిమి కొడుతుంటాడు.

11/17/2018 - 18:53

దక్షిణ భారతంలో ఒక అందమైన రాజ్యం పద్మపురి. ఈ రాజ్యంలో సుఖశాంతులకు పాడి పంటలకు విద్యా వ్యాపారాలకు కళలకు కళాకారులకు వీరులకు కొదువలేదు. ఆ రాజ్యానికి రాజు జ్ఞానవర్మ. మంత్రి కేశవనాథుడు మరియు సేనాపతి ధీరనాయకుడు.

11/10/2018 - 19:06

బబ్లూకి పదేళ్లు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. గారాబం ఉన్నా చదువులో ఫస్ట్. క్రికెట్ అంటే ప్రాణం. సెలవులు వస్తేచాలు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాలని ఆరాటపడతాడు. గేటు నుంచీ ఇంటి వరకు ఖాళీ స్థలం ఉండటం వల్లనయితేనేం, సొంత ఇల్లు కావటం వల్లనయితేనేం ఆడుకోవటానికీ, స్నేహితులకీ ఏ సమస్యా లేదు కానీ ఉన్న సమస్యల్లా పక్కింటి ఆంటీతోనే వస్తుంది.

11/03/2018 - 19:31

గోవింద్‌సేన్ కలకత్తా నుండి ఈ పట్టణానికి వ్యాపారరీత్యా వచ్చి స్థిరపడ్డాడు. కాళికాదేవి భక్తుడు. పట్టణంలో ఉన్న కలకత్తా వాసులను కలిసి వారి సహకారంతో ప్రతి సంవత్సరమూ నవరాత్రుల సందర్భంగా కాళికాదేవి బొమ్మను తీసుకుని వచ్చి టౌన్‌హాల్‌లో ఉంచి పూజలు జరిపించేవాడు. ఆ పట్టణంలో దసరా వచ్చిందంటే భక్తులు చాలామంది కాళీ విగ్రహం చూసి పరవశించిపోయి భక్తితో పూజించి వెళ్లేవారు.

10/27/2018 - 19:15

ఒక అడవిలోని నదీ తీరంలో ఒక కొంగల కుటుంబం ఉండేది. పక్కనే అడవి లోపల ఒక నక్క కుటుంబం కూడా ఉండేది. ఆ నక్కలన్నీ నీరు త్రాగేందుకు ఆ నదికి వచ్చేవి. అలా నక్కలకూ, కొంగలకూ స్నేహం కుదిరింది.
కొంగల కుటుంబంలోని అవ్వ ‘తన జాతి’ పిల్లలకు నీతులు బోధించేది. ఎవ్వరికీ ఏ అపకారమూ చేయక వీలైనంత వరకూ సాయం చేయమనీ, ఎవ్వరితోనూ విరోధం పెట్టుకోరాదనీ, అపాయాన్నీ, అవమానాన్నీ ఉపాయంతో జయించాలనీ చెప్పేది.

10/27/2018 - 19:13

మన తెలుగు ఆటల పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అనడానికి, వినడానికి కూడా బాగానే ఉంటాయి. ఒకప్పుడు అంటే పది పనె్నండేళ్ల క్రితం అయితే ఒక వాడలోని పిల్లలంతా ఒక దగ్గర చేరుకుని ఆటలాడుకునేవారు. అలా కలసిమెలసి ఆడుకోవటం వల్ల స్నేహితులుగా కాకుండా తోబుట్టువుల మాదిరిగా ఉండేది వారి మధ్య బంధం. ఇక ఇప్పుడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు.. ఇదే లోకం. బయటి వారి స్నేహం కాదు ఇంట్లో వాళ్ల మీద ప్రేమానుబంధాలు ఉండటంలేదు.

10/20/2018 - 20:44

ఒక్కొక్క ఆటకు నిర్ణీతమయిన ఆటస్థలం, ఆటగాళ్లు ఉండాలి. కాని ఈ ఆటను ఆడాలంటే ఆటస్థలం, ఆటగాళ్లు, ఎలాంటి వస్తువులు అవసరం లేదు. ఇసుకలో, మట్టిలో, ఇంట్లో కూడా ఆడుకోవచ్చు. ఇందులో ఉరకడం, గెంతడం లాంటివి ఉండవు. ఇంకో గమ్మత్తయిన విషయం ఏమిటంటే మనం ఆడుకునే ఆటల్లో కూరగాయల పేర్లు కూడా ఉన్నాయి. నిజమే! ఆ ఆట పేరే ‘దోసకాయ’.

Pages