S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

12/13/2019 - 05:53

ఒక ఊళ్లో పరంధామయ్య అనే లోభి ఉండేవాడు. ఆయన ఎంగిలి చేత్తో కాకిని తోలకపోయేవాడు. పిల్లికి కూడా బిచ్చం పెట్టకపోయేవాడు. దానధర్మాలు అంటే పరంధామయ్యకు అసలే గిట్టవు. మనుషులు తమ తమ పూర్వజన్మ పాపకర్మల వల్ల బీదవారుగా పుడతారని, దేవుడు వాళ్లను అలా పుట్టించటం వాళ్లను శిక్షించటానికేనని, బీదవాళ్లను మన దానధర్మాలతో ఆడుకోవటం వల్ల, మనం దేవుడి అభిమతానికి వ్యతిరేకంగా నడిచిన వాళ్లమవుతామనేవాడు.

11/30/2019 - 23:50

తల్లి నక్క పిల్ల నక్కని వైద్యుని దగ్గరకి తీసుకొచ్చింది.
అప్పటికే కొన్ని నక్కలు వైద్యుని పిలుపు కోసం గుహ బయట ఎదురుచూస్తున్నాయి. అదే వరుసలో కూర్చున్నాయి తల్లి నక్క, పిల్ల నక్క.. ‘వైద్యులు అడిగిన దానికి జవాబు చెప్పు. మూతి ముడుచుకుని కూర్చోక’ అంటూ హెచ్చరించింది తల్లి నక్క పిల్ల నక్కని. అలాగే అన్నట్టు మూతి ముడుచుకునే తలూపింది పిల్ల నక్క.

11/18/2019 - 22:13

మల్లేశ్వర పురంలో అరవై ఏళ్ల వయసున్న మల్లవ్వ మారు బేరానికి ఏక కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తెచ్చుకుని, అమ్ముకుంటూ జీవించేది. తన పెట్టుబడి వచ్చాక తనకు ఆ రోజుకు తిండికి సరిపోయే సొమ్ము కూడాక, మిగతా పండ్లను అమ్మేది కాదు.

11/09/2019 - 19:54

నల్లమల అడవిలో రాజు పదవికి ఎన్నికలు జరిగినప్పుడు తన గురువైన సింహానికి పోటీగా నిలబడిన ఏనుగు ఎన్నిక కావడం చిరుతకు కోపం, బాధ కలిగించింది.

11/02/2019 - 20:19

రమణయ్య తనకున్న ఆస్తిపాస్తులను అమ్ముకొని కొత్తగా వడ్డీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇరువర్గాల మధ్య నమ్మకమే పత్రమంటూ పత్రాలు రాయించుకోకుండా చాలామందికి అప్పులిచ్చేశాడు.
కొన్ని నెలలపాటు వడ్డీలు క్రమం తప్పకుండా వసూలు చేసుకోగలిగాడు కానీ తరువాత మాత్రం ఎటువంటి పత్రాలు గానీ సాక్ష్యాలు గానీ లేకపోవడండో వడ్డీలు వసూలు చేసుకోవడం చాలా కష్టమై పోయింది రమణయ్యకు.

10/26/2019 - 19:52

ఒక అడవిలో ఏనుగు ఉండేది. దానికి ఒక పిల్ల కూడా ఉండేది. పిల్ల ఏనుగును తల్లి అల్లారుముద్దుగా చూసుకొని దానికి ‘నళిని’ అని ముద్దు పేరు పెట్టింది. తల్లి ఏనుగు రోజూ నళినిని తనతో అడవికి తీసుకువెళ్లేది. ఇంతలో వేసవికాలం వచ్చింది. వేసవి అవడంచేత అడవిలో చాలా చెట్లు ఎండిపోయాయి. ఆహారం లభించడం కష్టమైంది. ఒకనాడు పిల్ల ఏనుగు ఆకలికి తట్టుకోలేక సొమ్మసిల్లిపోయింది.

10/19/2019 - 20:07

ఒక ఊరిలో గుణవర్మ అనే వ్యక్తి నివసించే వాడు. అతనికి విజ్ఞానం అనంతంగా గడించాలనీ తనంత గొప్పవాడు లేడనీ అనిపించుకోవాలనీ తపన వుండేది. అందువల్ల ఆ ఊళ్లో ఉన్న మహాపండితుడు రామశాస్ర్తీ వద్ద శిష్యరికం చేస్తూ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అయితే అంతటితో అతని విద్యాభ్యాసం పూర్తి కాలేదు.

10/12/2019 - 19:34

పూర్వకాలంలో సంపాతి, జటాయువు అనే పక్షి రాజులు ఉండేవారు. వారిద్దరు అన్నదమ్ములు. మహా బలవంతులు. ఒకసారి అన్నదమ్ములిద్దరికీ వారిద్దరిలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలన్న ఉద్దేశం కలిగింది.

10/05/2019 - 20:02

రాము, సోము ఇద్దరూ మంచి స్నేహితులు. పరీక్షలు ఎప్పుడు వచ్చినా ఇద్దరూ ఎక్కడో ఒకచోట కలిసి కూర్చుని చదువుకునేవారు. అలా ఒకరోజు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని బడికి కాస్తంత దూరంలో కూర్చుని ఒకరితో ఒకరు చర్చించుకుంటూ చదువుకుంటున్నారు. అక్కడికి దగ్గరలోనే ఆ ఊరి రైల్వేస్టేషన్ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్లిద్దరూ అదే బడిలో చదవడం వల్ల రైలు రాకపోకల వల్ల కలిగే శబ్దం వారి చదువుకి ఆటంకం కలిగించలేదు.

09/21/2019 - 20:06

గోపాలపురంలో వున్న సత్యం ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. తెలివైనాడు.. చదువులో ముందు ఉండేవాడు. తమ ఊరిలో అయిదవ తరగతి వరకే ఉండడంతో ఊరిలో ఉండే మిగిలిన పిల్లలు సుబ్రహ్మణ్యం, నాగేంద్ర, అచ్యుత్, సుబ్బారావులతో కలిసి ప్రక్క ఊరు అయిన నరేంద్ర పట్నం వెళ్లి చదువుకునేవాడు.

Pages