S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

07/21/2018 - 18:27

విజయుడు ఒక గురుకులంలో సమస్త విద్యలు, మంత్రతంత్ర విద్యలు కూడా పూర్తి చేసుకుని గురువుగారికి తగిన దక్షిణ సమర్పించి, ఆయన ఆశీర్వాదం తీసుకుని తన ఊరికి బయలుదేరాడు. అలా విజయుడు కొన్ని మైళ్లు నడిచిన తరువాత ఓ ఇంటి అరుగు మీద బడలిక తీర్చుకునేందుకు కూర్చున్నాడు.

07/07/2018 - 23:37

రామాపురంలో గోవిందయ్య అనే అతను బజారులో కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవాడు. సామాన్లు అందివ్వడానికి ఎవరినో ఒకరిని పనికి పెట్టుకునేవాడు. కొంతకాలం అయ్యాక అతనికి జీతం ఇవ్వాల్సి వస్తుందని అతనిపై ఏదో ఒక నింద మోపి తరిమేసేవాడు. అలా అతని దగ్గర చాలామంది పనికి కుదిరి, ఆ తర్వాత దొంగని ముద్ర వేయించుకొని వెళ్లిపోయారు. ఆ వూళ్లో వాళ్లకి గోవిందయ్య సంగతి తెలియడంతో పనికి ఎవరూ రాలేదు.

07/01/2018 - 00:06

అడవికి రాజైన సింహం, పిల్ల జంతువులన్నింటికి విద్యాబుద్ధులు నేర్పించి ఆదర్శమైన అడవిగా తయారుచేయాలనుకుంది.
జంతువులన్నింటిని సమావేశ పరచింది. ‘చదువు తెలివిని పెంచుతుంది. మంచి నడతకు దారి చూపుతుంది. అందుకోసం మన పిల్లలకు తప్పనిసరిగా విద్యాబుద్ధులు నేర్పించాలి’ ఆదేశించింది సింహం.

06/23/2018 - 23:43

పు ష్పగిరి దేశపు రాజు మృగయా వినోదం కోసం అడవికి వెళ్లాడు. ఒక జింకను వేటాడుతూ అడవిలో దారితప్పిపోయాడు. ధనవర్మ అడవిలో తిరుగుతూ సరిహద్దు గ్రామం తాళ్లూరు చేరుకున్నాడు. ఊరి చివర ఇంట్లో వున్న కాంతమ్మ అతన్ని ఆదరించింది. రుచికరమైన భోజనం వడ్డించి ఆకలి తీర్చింది. ధనవర్మ ఎంతో సంతోషించాడు.

06/16/2018 - 22:15

అదో చిన్న కుగ్రామం. రైతులు పూరిగుడిసెల్లో నివాసముంటూ పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు సైతం పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రతి రైతు ఇంటిలో గినె్న కోళ్లు వున్నాయి. అవి ఎక్కడ పడితే అక్కడ గుడ్లు పెట్టేవి. రైతులు వాటిని సేకరించి ఆరగించేవారు. అయితే కొంతకాలంగా గినె్నకోళ్లు పెట్టిన గుడ్లు మాయవౌతున్నట్లు భీమయ్య అనే రైతు కనిపెట్టాడు.

06/10/2018 - 00:05

చిన్న పిల్లలు పెద్ద పిల్లలతో కలసి ఆడుకునే ఆట ఇది. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లలు ఈ ఆటలో పెద్దగా వ్యవహారిస్తారు. వారు ఇంట్లో పిల్లలతో పాటుగా ఇరుగుపొరుగువారిని కూడా పిలుచుకుని ఈ ఆటను మొదలుపెడతారు. ఈ ఆటలో పిల్లల సంఖ్యతో నియమం లేదు.

06/10/2018 - 00:03

అత్తరు దుకాణానికి వెళ్తే - అక్కడ మనమేమీ కొనకపోయనా
కొంత పరిమళాన్ని తప్పక ఆఘ్రాణిస్తాం.
ఉత్తముల సాహచర్యమూ అంతే.

06/10/2018 - 00:02

సీతాపతి మాస్టారికి ఆ రోజంతా ఆందోళనగా ఉంది. గత కొన్ని రోజులుగా ఐదవ తరగతి పిల్లల డబ్బు, వస్తువులు మాయమవుతున్నాయి. ఆ రోజయితే ఏకంగా ఆయన ఖరీదైన పెన్నుని మాయం చేసారు. దురలవాట్లకు లోనయిన విద్యార్థుల పనే అయి ఉంటుందని గ్రహించారు మాస్టారు.

06/02/2018 - 21:35

తెలుగు జాతీయాలు
=============
పుక్కిటి పురాణము
సారములేని తేడాలు కనుక్కోండి

లోకాభిరామాయణం
ఆకాశరామన్న
ఊరు, పేరు లేని మనిషి
అడవిగాచిన వెనె్నల
ఎంత మనోహరమైనా వ్యర్థమగుట
బ్రతుకు జీవుడా
మీదపడిన ఆపదను తప్పించుకొనుట
తాతకు దగ్గులు నేర్పుట
తెలిసినవాడికి తెలియజెప్పబోవుట

06/02/2018 - 21:33

‘ఇదుగో రోజూ ఇలా అన్నం పారేస్తే బూచాడు ఎత్తుకుపోతాడు’ అంది కోప్పడుతూ గౌరి.
‘బూచాడంటే..’ అడిగింది రాణి.
‘బూచాడంటే మనింటికి వస్తాడే గడ్డం పెంచుకుని, ఎర్రటి కళ్లతో అలా ఉంటాడు. తీసికెళ్లి చీకటి కొట్లో పడేస్తాడు. అన్నం పెట్టడు’ అని చెప్పింది.
‘ఆ...’ అంటూ ఏడుపు మొహం పెట్టింది రాణి.
‘వాణ్ణి నేను చంపేస్తాను’ అంది ఏడుస్తూనే.

Pages