బాల భూమి
రాజుగారి ఇల్లు ( కథ )
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒకప్పుడు రాజభోగాలు అనుభవించి అట్టహాసంగా బ్రతికిన రాజా రవివర్మ గారి కుటుంబం తరువాతి తరాల కాలంలో బాగా చితికిపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవసాగింది.
అప్పుల కుప్పలు పెరిగిపోవడంతో ఆ కుటుంబపు వారసుడైన అనంతవర్మ భవనాన్ని అమ్మకానికి పెట్టాడు. అయితే, వీరి పరిస్థితి తెలిసిన చుట్టుపక్కల ధనికులు తక్కువ ధరకు చేజిక్కించుకోవాలని అత్యాశతో కొనడానికి ఆసక్తి చూపలేదు సరికదా కొత్తవాళ్లెవరైనా వచ్చినా ఆ భవనంలో రాజుగారి ఆత్మ ఉందని భయపెట్టి తరమేయసాగారు.
ఈ విషయం గురించి బాధపడుతూ నగరంలో చదువుకొంటున్న కూతురు షాలినికి చెప్పి బాధపడ్డాడు అనంతవర్మ. అది విన్న ఆమె ఒక ఉపాయం చెప్పింది. అనంతవర్మ మరునాడే భవనం ముందు అమ్మకం కోసం ఉంచిన బోర్డు తీసివేయించాడు. పైగా అందరితో దయాలంటే క్రేజ్ ఉన్న విదేశీయులు కొందరు రాజుగారి ఆత్మ ఉందని తెలిసి ఉత్సాహంతో అధిక ధర ఇచ్చి కొనుక్కోబోతున్నారని, దయ్యాల మీద పరిశోధనలు చేస్తారని, కాబట్టి తాము వారికి అమ్మేసి నగరానికెళ్లిపోతామని చెప్పసాగాడు.
విషయం చెవిన పడిన ఊళ్లోని ధనికులకు భయం మొదలైంది. ధర తగ్గే మాట అటుంచి, దయ్యాల పరిశోధకులొచ్చి ఈ ప్రాంతాన్నంతా దయ్యాల పేరుతో ఇబ్బందుల పాలుచేస్తే ఎలా అన్న బెరుకు మొదలైంది. దాంతో ఓ అరడజను మంది కలిసికట్టుగా అనంతవర్మను వచ్చి కలిశారు.
‘విదేశీయులకెందుకండీ.. మేము కొనుక్కుని మ్యూజియంగా డెవలప్ చేస్తాం. అప్పుడు డబ్బులు, గుర్తింపు రెండూ వస్తాయి’ అని చెప్పి అననుకున్న దానికంటే ఎక్కువ ధనమిచ్చి కొనుక్కున్నారు.
సమస్య సులభంగా తీరటంతో ఆ ఆనందాన్ని కూతురితో పంచుకుని, అప్పులు తీర్చేసి, నగరంలో ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయాడు అనంతవర్మ.