S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

05/13/2018 - 13:27

మంచిమాట
========
కొండను కదిలించాలన్న ఆలోచన సరే,
ముందు కొన్ని చిన్నరాళ్ళను
పైకెత్తే ప్రయత్నం చెయ్యి.

*

పొడుపు కథ
========
చీకటి పడకముందే
ఇంటికి చేరాలనే తొందరేం లేదు
రాత్రయినా, పగలయినా
చేత దీపం పట్టుకుని తిరుగుతుంది- ఏమిటది?

జవాబు:
మిణుగురు

05/13/2018 - 13:22

తెలుగు సామెతలు
-----------------
* అయితే ఆవలి ఒడ్డు .. కాకుంటే ఈవలి ఒడ్డు
* కొత్తలు లేకున్నా వెంట్రుకలకు
అత్తరు నూనె పెట్టుకున్నట్లు
* ఒక్క చెయ్యి తట్టితే చప్పుడగునా?
* కుండ మోయనోడు బండ మోయపోయినట్లు
* కానుగ నీడ.. కన్నతల్లి నీడ
* తాడు చాలదని బావి పూడ్చినట్టు
* రంగారెడ్డి జిల్లాకు అంగూరు పండ్లు
అమ్మబోయినట్లు

05/13/2018 - 13:20

జీవితానికి పరమావధి..
-----------------------------
నీతులు నీడనివ్వవు..!
సామెతలు సంపదలను ఇవ్వవు..!!
ఆణిముత్యాలు ఆకలి తీర్చవు..!
సుభాషితాలు సుఖాలనివ్వవు..!!
మంచిమాటలు మరణాన్ని ఆపవు..!
సూక్తులు సుగుణాలనివ్వవు..!!
కొటేషన్లు కోర్కెలు తీర్చవు..!
శ్లోకాలు స్థోమతలను ఇవ్వవు..!!
ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు..!

05/13/2018 - 13:19

బురుకూ బురికీలు
----------------------
బురుకూ బురికీలు ఓహో
ఎక్కడ దొరికీలు
ముద్దూ పెట్టేవారికి చిట్టీ
బరుకూ బరికీలు ॥ బురుకూ ॥

ఉక్కా ఉంగేలు నోటా
ఊరూ చొంగల్లు
ఎక్కడికక్కడె ఉరకలు వేసే
చెంగు చెంగీలు ॥ బురుకూ ॥

గుప్పీ గుప్పిళ్ళూ మూసీ
విప్పీ దొప్పల్లూ
ఎప్పటికప్పుడె వత్తులు వత్తీ
లడ్డూ బరిఫీలు ॥ బురుకూ ॥

05/13/2018 - 13:15

సుమతీ శతకం
==========
ఉత్తమ గుణముల నీచున
కెత్తుఱఁగున గలుగనేర్చు నెయ్యెదలన్ దా
నెత్తిచ్చి కఱఁగి పోసిన
నిత్తడి బంగారమగునె యిలలొ సుమతీ!

తాత్పర్యం: అల్పబుద్ధి గలవానికి ఏ విధంగా సాయం చేసినా మంచి బుద్ధి రాదు, ఇత్తడికి సమానంగా బంగారాన్ని తీసుకుని ఎంత కరిగించి పోసినా- అది బంగారానికి సాటిరాదు. అలాగే నీచుడు కూడా.

05/13/2018 - 13:13

చెండు అంటే బంతి. దీనిని పాత గుడ్డలతో తయారు చేసుకొంటారు. చెండులాగా తయారైన ఈ బంతితో ఆడుతారు కనుక దీనిని చెండాట అంటారు. కాని ఈ కాలంలో బంతులు రబ్బర్ బాల్, కార్క్ బాల్, లేక పుట్‌బాల్ అని, వాలీబాల్ అని, ఫ్లాస్టిక్ బాల్ ఇలా రకరకాలు బాల్స్ అంటే బంతులు వచ్చి ఈ ఆట మరుగున పడిపోయింది. కాని ఇప్పుడున్న బాల్ లేక బంతులతో ఆ చెండాటను ఆడితే లేనిపోనీ ప్రమాదాలు ఏర్పడుతాయి.

05/06/2018 - 07:26

సామెతలు...
=========

05/06/2018 - 07:26

భాస్కర శతకం
---------------
శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్
సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా

05/06/2018 - 07:24

సూక్తులు
======

05/06/2018 - 07:23

పరాచకాలు
==========

వదినగారూ మీరు వాసిగలవారు
వండబోయినచోట కుండ నాకేరు!
పరాచకాలు
వదినగారూ మీరు వాసిగలవారు
వండబోయినచోట కుండ నాకేరు!

బావగారూ మీరు ప్రతిభకలవారు
నిండిన సభలోను పిండిబొక్కేరు!

చక్కిలాలాబుట్ట చంకబెట్టుకొని,
సభలోను మా బావ సంగీతపరుడు!

అత్తింటి కోడలూ అలిగి పడుకుంది
అలుకలు తీర్చవే ములుకుల్లకఱ్ఱ!

Pages