S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాళ్లా గజ్జె కంకాళమ్మ...

చిన్న పిల్లలు ఆడుకునే ఆట. ముఖ్యంగా ఆడపిల్లలు ఆడుతుంటారు. మగపిల్లలు కూడా ఆడుతుంటారు. కాని మగపిల్లలు ఈ ఆట పట్ల అంత ఆసక్తి కనబరుచరు.
ఆడపిల్లలు కాళ్లకు గజ్జెలు లేదా పట్టీలు పెట్టుకొంటారు. వారంతా ఐదారుగురు ఒక చోట చేరి కాళ్లు చాపి కూర్చుంటారు. వీరిలో పెద్దవారు లేకుంటా వరుస క్రమంలో అందరి కాళ్లను తడుతూ అంటే తాకుతూ
కాళ్ల గజ్జె కంకాళమ్మ
వేగుచుక్కా వెలగాపండు
అల్లవారింటికి చల్లాకని పోతే
అల్లవారింట కుక్క భౌ భౌ
నీ కాళ్ల గజ్జెలు ఘల్లు ఘల్లు అంటారు
ఈ చివరి చరణం అనేటపుడు ఎవరి కాలును తాకుతారో వారు ఆ కాలునెత్తుతారు . ఆ కాళ్లకున్న గజ్జెలు ఘల్లు ఘల్లు అని శబ్దం రావడంతో పిల్లలంతా చక్కని చిరునవ్వులు చిందిస్తుంటారు. ఇంతకుముందు కాలంలో మగపిల్లలకు కూడా కాళ్లకు కడియాలు వాటికి గజ్జెలు పెట్టేవారట. అందుకే వారు కూడా ఈ ఆటలో పాల్గొనేవారు.
ఈ ఆటలో పాడే పాట చాలా పెద్దదిగా కూడా పాడుతుంటారు. ఈ పాటలో ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయని ఆచార్య బిరుదురాజు రామరాజుగారు తాను సేకరించిన వ్రాసిన పరిశోధన గ్రంథంలో చెప్పారు.

-జంగం శ్రీనివాసులు