బాల భూమి

తెలుగు సామెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సామెతలు
-----------------
* అయితే ఆవలి ఒడ్డు .. కాకుంటే ఈవలి ఒడ్డు
* కొత్తలు లేకున్నా వెంట్రుకలకు
అత్తరు నూనె పెట్టుకున్నట్లు
* ఒక్క చెయ్యి తట్టితే చప్పుడగునా?
* కుండ మోయనోడు బండ మోయపోయినట్లు
* కానుగ నీడ.. కన్నతల్లి నీడ
* తాడు చాలదని బావి పూడ్చినట్టు
* రంగారెడ్డి జిల్లాకు అంగూరు పండ్లు
అమ్మబోయినట్లు
* చేతికానివానికి కూతలెక్కువ,
వంటరాని వానికి వంకలెక్కువ
* కాళిదాసు కవిత్వం కొంత,
నా పైత్యం కొంత!
* నోరున్నవానికి ఊరు అప్పజెప్పినట్లు
* గతిలేనివాడు గాడిద కాలు పట్టుకున్నట్లు
* ఏడు మెతుకులు తింటే ఏనుగంత సత్తువ

సామెతలు
-----------
* అందరి కాళ్లకు మొక్కినా
అత్తారింటికి పోక తప్పదు
* అందరినీ మెప్పించడం అలవిగాని పని
* అందానికి దాల్చిన ఆభరణం
ఆపదలో ఆదుకుంటుంది
* రౌతు మెత్తనైతే గుర్రం
మూడు కాళ్ల మీద నడుస్తుంది
* శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు
* అప్పు చేసి పప్పుకూడు
* నీరు పల్లమెరుగు-నిజము దేవుడెరుగు
* రౌతు కొద్ది గుర్రము- పిండికొద్దీ రొట్టె
* రొట్టె విరిగి నేతిలో పడినట్లు
* మెరిసేదంతా బంగారం కాదు
* బూడిదలో పోసిన పన్నీరు
* పోరు నష్టము - పొందు లాభము
* పెదవి దాటిన.. పృథిని దాటును
* చెప్పేవారికి వినేవారు లోకువ
* పిట్ట కొంచెము కూత ఘనము
* నవ్వు నాలుగు విధాల చేటు
* దూరపు కొండలు నునుపు
* దిక్కులేనివారికి దేవుడే దిక్కు
* దాసుని తప్పులు దండముతో సరి
* తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు
* తాతకు దగ్గులు నేర్పుటయా?