బురుకూ బురికీలు
Published Sunday, 13 May 2018బురుకూ బురికీలు
----------------------
బురుకూ బురికీలు ఓహో
ఎక్కడ దొరికీలు
ముద్దూ పెట్టేవారికి చిట్టీ
బరుకూ బరికీలు ॥ బురుకూ ॥
ఉక్కా ఉంగేలు నోటా
ఊరూ చొంగల్లు
ఎక్కడికక్కడె ఉరకలు వేసే
చెంగు చెంగీలు ॥ బురుకూ ॥
గుప్పీ గుప్పిళ్ళూ మూసీ
విప్పీ దొప్పల్లూ
ఎప్పటికప్పుడె వత్తులు వత్తీ
లడ్డూ బరిఫీలు ॥ బురుకూ ॥
చుబుకూ చుబుకీలు ఓహో
గబుకూ గబుకీలు
కుడిచే కుడిచే వేళ్ళూ ఊడీ
ఉలుకూ ఉలుకీలు ॥ బురుకూ ॥
చిట్టి తమ్ములూ ఓహో
చిన్నా పాపలూ!
చీచీ అంటే తెరలూ తెరలూ
బోచీ నవ్వుల్లూ ॥ బురుకూ ॥