S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల భూమి

04/08/2018 - 03:59

ఈ ఆటలు మగపిల్లలు ఎక్కువగా ఆడుతుంటారు. ఆడపిల్లలు ఈ ఆటను ఆడడానికి ఇష్టపడరు. ఆటలు ఎవరైనా ఆడుకోవచ్చు.కాని ఎవరికి అనుకూలమైన ఆటలను వాళ్లు తమ మనస్ఫూర్తిగా ఆడుతారు కదా. అందుకేనేమో ఈ ఆటను మగపిల్లలు ఆడడంలో ఆసక్తి చూపుతారు.
ఇందులో రెండు కర్రలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది చిన్న కర్రను బిళ్ల అని లేక చిర్ర అని అంటారు. పెద్దకర్రను కోడు అని గోనె అని అంటారు.

03/31/2018 - 23:44

* ఎండాకాలంలో ఏకులు వడికి వానాకాలంలో వడ్లు దంచినట్లు
* ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడు తోకే
* ఎంత పండినా కూటికే, ఎంత ఉండినా కాటికే
* ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు
* ఎంత చెట్టుకంత గాలి
* ఎంత పెద్ద ఆబోతైనా పులికి లోకువే
* ఎంత పెద్ద గుమ్మడి అయినా కత్తిపీటకు లోకువే
* ఎద్దుకొద్దీ సేద్యం, సద్ది కొద్దీ పయనం
* నవ్వు నాలుగువిధాల చేటు

03/31/2018 - 23:43

చిట్ల పొట్లకాయ
సీమనెల్లికాయ
గోడపుచ్చకాయ
గొబ్బినెల్లికాయ
అత్తకు పెడితే అల్లం
నే తింటే బెల్లం

కొత్త కుండల్లోని గోధుమల్లారా!
పాలపిడతల్లోని పసిబిడ్డలార!
అమ్మ అమ్మ నీ బిడ్డ పేరేమంటే,
నీళ్లల్లో నిమ్మపండు
పాలల్లో పనసపండు
నేతిలో నేరేడుపండు

03/31/2018 - 23:42

142857 - ఈ సంఖ్య చాల మొండిది. దీనిని 2 చేత హెచ్చవేస్తే జవాబులో తిరిగి అవే అంకెలు స్థానాలు మారి వస్తయ్. 3 చేత, 4 చేత, 5 చేత, 6 చేత హెచ్చవేసినా అవే అంకెలు స్థానాలు మారి వస్తవేగాని మరోకొత్త అంకె రాదు. కాని ఈ సంఖ్యని 7 చేత హెచ్చవేస్తే, ఇదివరకులా కాక, జవాబులో అన్నీ తొమ్ముదులే వస్తాయి.
142857 న 2 =285714
142857 న 3 =528571
142857 న 4 =571428
142857 న 5 =714285

03/31/2018 - 23:41

కూరిమిగల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు, మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!

-సుమతీ! ఒకరికి ఒకరు స్నేహంతో ఉన్నంత కాలం వారి మధ్య నేరములు ఉన్ననూ కనబడవు. కానీ ఆ స్నేహం చెడిన వెంటనే ఒప్పులే తప్పులుగా కనబడతాయి. ఇది జగమునందు సత్యము. మానవ సహజ గుణం.

03/31/2018 - 23:39

మనం మాట్లాడే ప్రతి పలుకూ ప్రేమతో నిండి ఉండాలి.
-మదర్ థెరెసా

03/31/2018 - 23:38

అడవిలో పుట్టింది
అడవిలో పెరిగింది
వొంటినిండా గాయాలు
కడుపునిండా రాగాలు?
జవాబు: -మురళి

03/31/2018 - 23:36

వర్తమాన కలియుగం క్రీ.పూ.3102 ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 2గంటల 27నిమిషాల 30సెకండ్ల కాలమున ప్రారంభమైనదని నిర్ణయించారు. ఫ్రెంచిదేశపు ఖగోళ శాస్తవ్రేత్త ‘‘బెయిలీ’’ భారతీయుల ఖగోళ విజ్ఞాన మేధా సంపత్తికి జోహార్లర్పించారు. 14వ లూరుూ ఆజ్ఞానువర్తియైన లాబెరే క్రీ.శ.1687లో ఐరోపాకు ఇండియా నుండి తీసుకెళ్ళిన పథకాలను ‘‘కాసిని’’, ‘‘మేయర్’’ పథకాలతో పోల్చి ఎట్టి తేడా లేదని తేల్చారు.

03/31/2018 - 23:35

పూర్వం దండకారణ్యంలో చిదానంద మహర్షి అనే ముని తపస్సు చేసుకుంటూ, తమ ఆశ్రమానికి విద్యార్జన కోసం వచ్చిన వారికి విద్యాబోధ చేస్తూ ప్రశాంతంగా జీవించసాగారు. ఆయన ఆశ్రమానికి చుట్టూ ఉండే పశు పక్ష్యాదులన్నీ ఆయన ఆశ్రమ విధులకు, తపస్సుకు ఏ మాత్రం భంగం కలుగకుండా దూరదూరంగా తిరుగుతూ, ఐకమత్యంగా జీవించేవి. ఆయన ప్రభావం వల్ల అవి పోట్లాడుకోకుండా స్నేహభావంతో మసలేవి.

03/24/2018 - 22:13

ఒక విషయాన్ని పట్టుకుని తర్కిస్తూ పోతే, అంటే ఒక క్రమంలో చర్చిస్తూ పోతే, ఆ విషయాన్ని రుజువు చేసే వీలు ఉంటుంది. కానీ ఒక కొత్త విషయాన్ని కనుగొనే అవకాశం రాదు. కొత్త విషయం కనుగొనడానికి మనసులో ఒక కొత్త ఊహ పుట్టాలి. కేవలం చర్చవల్ల అది పుట్టదు. ఈ మనసులోని ఊహకు ఇంట్యూషన్ అని పేరు. ఇందుకు తగిన మాట తెలుగులో ఉందేమో వెతకాలి.

Pages