బాల భూమి

అరికాలి మంట నెత్తికెక్కడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరికాలి మంట నెత్తికెక్కడం
అర్థం - కోపం అధికం కావడం
వివరణ - మితిమీరిన విద్యార్థుల అల్లరితో ఉపాధ్యాయునికి అరికాలి మంట నెత్తికెక్కింది.
అతిరథ మహారథులు
* ఈ మాట భారతం నాటిది. ఒక విలుకాడితో నయినా సమంగా పోరాడలేని వాణ్ణి అర్ధరథుడనే వాళ్లు. ఒక్క రథుడితో సమంగా పోరాడగలవాడు సమరథుడు. అనేకులైన విలుకాళ్లతో - ఒక్క లెక్క ప్రకారం పదకొండు వేల మందితో - పోరాడగలవాడు మహారథుడు అంటారు. కొంతమంది లెక్కన తనను తాను సంరక్షించుకుంటూ తన సారథినీ గుర్రాలనూ కాపాడుకుంటూ పోరాడగల వ్యక్తిని ఈ పేరుతో పిలుస్తారు. అంతకన్నా సమర్థుడు అతిరథుడయితే అతణ్ణి మించిన యోధుడు అతిరథ శ్రేష్ఠుడు. ఈ పరిగణన భేదాలెలా ఉన్నా మహావీరులనే అర్థంలో అతిరథ మహారథులని సమర్థులయిన వ్యక్తుల గురించి ప్రస్తావించటం కద్దు. ఈ రథాల సంగతి పాత కాలపు యుద్ధానికి సంబంధించిందే కాని - ఈనాటి వ్యవహారంలో యుద్ధరంగంతో సంబంధం లేని ఇతర రంగాల్లో కూడా సమర్థులని, శక్తిమంతులనీ చెప్పటానికి ఈ జాతీయాన్ని ప్రయోగించటం అలవాటయింది.
అల్లుడు రాలేదని అమావాస్య ఆగుతుందా?
- సంక్రాంతిని ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు కొత్తగా పెళ్లైన అల్లుళ్లు అత్తవారింటికి వెళ్లే ఆచారం ప్రజలలో ఎక్కువగా ఉంది. ఈ ఆచారాన్ని సామెతగా తీసుకొని జానపదులు చక్కగా చెప్పారు. అందుకే, సకాలంలో మన పనులు పూర్తి చేసుకోవాలనే జీవన రీతిని చెపుతూ ఈ జాతీయాన్ని ప్రయోగిస్తూ ఉంటారు.