బాల భూమి

బలహీనం.(. కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమల అడవిలో రాజు పదవికి ఎన్నికలు జరిగినప్పుడు తన గురువైన సింహానికి పోటీగా నిలబడిన ఏనుగు ఎన్నిక కావడం చిరుతకు కోపం, బాధ కలిగించింది.
ఏనుగు రాజుగా ఎన్నిక కాగానే అన్ని జంతువులను ఒక్కొక్కటిగా పిలిచి ‘జంతువుల్లారా! దట్టమైన అడవి ఉంటేనే వర్షాలు పడటం, ఉష్ణోగ్రత ఎక్కువగా లేకుండటం జరుగుతుందన్న ఉద్దేశంతో చుట్టుపక్కలున్న రాజ్యాల వారు ఈ నల్లమల అడవిని వృద్ధి చేయాలని నిర్ణయించుకుని అడవిలో చెట్లు నరకడం కూడా నిషేధించారు. ఈ నల్లమల అడవి చీమలు దూరని చిట్టడవి కాకులు దూరని కారడవిగా పేరు పొందింది. అడవి ఎవరూ ఊహించనంత పచ్చదనంతో నిండిపోయింది కానీ..’ అంది బాధగా ఏనుగు.
‘కానీ ఏమిటి మహారాజా?’ అడిగింది కుందేలు మంత్రి.
‘ఈ అడవిలో ఒక జంతువు మరొక జంతువును చంపుకుని తినడం వల్ల జంతువుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోంది. జంతువుల సంఖ్య తగ్గకుండా ఉండటం కోసం జంతు వధ నిషేధం అమలు చేస్తున్నాను’ అంది ఏనుగు.
‘వేటాడే జంతువుల సంగతి..?’
‘ఏ జంతువైనా సరే జంతువుల వేట నిషేధించడమైనది, ఏవైనా జంతువులు మామూలుగా మరణిస్తే మొదట సింహం చిరుత లాంటి జంతువులకు ఆహారంగా సమర్పించాలి. ఏ జంతువు దొరకని రోజు మనతోపాటు శాకాహారం తినాలి’ అంది.
రాజాజ్ఞ అన్ని జంతువులూ పాటించసాగాయి.
వెనె్నల రోజుల్లో జంతువుల మధ్య పరుగు పందెం పోటీలు ఏర్పాటు చేశారు.
పోటీ గురించి గురువైన సింహం దగ్గరకెళ్లి ‘నాకు జింకతో పరుగు పందెం ఉందంట. ఆ నల్లమల కొండ చుట్టి రావాలని చెప్పారు’ అంది చిరుత.
‘చిరుతా, పరుగు పందెంలో జింక నీకన్నా బలహీనమైన జంతువు. నీవు దానికన్నా వేగంగా పరుగెత్తి విజయం పొందుతావు’ అంది సింహం.
సింహం చెప్పిన విధంగానే పరుగు పందెంలో జింక ఓడిపోయింది.
కొంతకాలం తరువాత ఏనుగు రాజు అనారోగ్యంతో మరణించడంతో మరలా ఆ అడవికి రాజుగా సింహం ఎన్నికయింది. జంతువధ నిషేధం తొలగిస్తున్నట్లు ప్రకటించింది. జంతు వధ అనుమతించడంతో చిరుతలో చెప్పలేనంత సంతోషం కలిగింది. వెంటనే ఒక జంతువును చంపి తినాలని నిర్ణయించుకొంది.
పరుగు పందెంలో తన దగ్గర ఓడిపోయిన జింక దగ్గరకు వెళ్లి ‘అడవిలో జంతు వధ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇంతకు మునుపే రాజుగారు ప్రకటించారు. జింకా! నేను ఈ రోజు నిన్ను చంపి తింటాను పారిపోవటానికి ప్రయత్నించకు. నీకన్నా నేను వేగంగా పరుగెత్తగలనన్న సంగతి నీకు తెలుసుగా?’ అంది చిరుత.
ఎటువంటి సమాధానం చెప్పకుండా మెరుగులా ఎగిరి వేగంగా పరుగెడుతుంటే కోపంతో జింకను పట్టుకోవడానికి చిరుత వెంటాడసాగింది. చివరకు తనకు అందనంత దూరంగా జింక పారిపోవడం అవమానంగా తోచింది.
ఆ విషయం సింహం దగ్గరకెళ్లి చెప్పింది చిరుత.
‘ఎటువంటి బలహీనమైన జంతువైనా సర్వశక్తులూ ఉపయోగిస్తే ఎంతటి పరాక్రమము చూపెడుతుందో ఊహించలేము. స్వతహాగా పరుగెత్తడంలో నీకన్నా జింకకు వేగం తక్కువ. మరణమా జీవితమా అన్న సమస్య రాగానే ఆ జింక సర్వశక్తులు ఉపయోగించి నీకన్నా వేగంగా పరుగెత్తింది’ అంది సింహం.
బలహీనమైన జంతువైనా తక్కువగా అంచనా వేయకూడదని తెలుసుకొంది చిరుత.

-ప్రకాష్ ఓట్ర 9787446026