S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వామనగుంటల ఆట

ఇదొక ఇండోర్ గేమ్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఆటను ఎక్కువగా ఆడపిల్లలు ఆడుతుంటారు. ఒక్కోసారి మగపిల్లలు, పెద్దవాళ్లు కూడా ఆడుతారు. పెద్దవాళ్లు అయితే ఇద్దరు కోడళ్లున్న అత్తగారు ఆడుతారు. ఒక్కకోడలున్నా అత్తతో కలసి ఆడుకునేవారుంటారు.
అయితే ఈ వామనగుంటలు సాధారణంగా చెక్కతో చేసి ఉంటారు. ఒక్కోసారి కొందరు నేలమీద మట్టి తవ్వి గుంటలు చేసి ఆడుతారు. మరికొందరు గుంటల్లాగా గీతలు గీసి ఆడుతుంటారు. చెక్కతో చేసిన వామనగుంటలు ప్రతివారింట్లోను ఇంతకుముందు కాలంలో ఉండేవి. నేడు కూడా అక్కడక్కడా ఇవి కనిపిస్తూనే ఉంటాయి.
ఆడేవిధానం:
ఈ ఆటను చింతపిక్కలు, సీతాఫలం గింజలతో ఆడుతుంటారు.
వామనగుంటలు ఏడు గుంటలు ఉంటాయి. అటువైపు ఏడు ఇటువైపు ఏడు గుంటలుంటాయి. పదమూడు గింజలు తీసుకొని ప్రతి గుంటలో పదమూడు గింజలు మొట్టమొదట పోస్తారు. ఆడేవారు ఎదురెదురుగా కూర్చుని బొమ్మ బొరుసుతోనో లేక ఇద్దరి అభిప్రాయంతోనో ఒకరు మొదలుపెడతారు. ఏదో ఒక గుంటలోని గింజలు తీసుకుని పక్క గుంటనుంచి ఒక్కో గింజను వేస్తూ పోతారు. రెండు వైపులా గింజలు వేయాలి. ఇలా వేస్తూ పోతే ఒక్కచోటుకి గింజలు లేని ఖాళీ గుంట కనిపిస్తుంది. అపుడు ‘తుప్పా’ అంటూ ఆ గుంటలు తడుముతూ పక్కగుంటలోని గింజలను, దాని ఎదురుగా ఉన్న గింజలను తీసుకొని ఆట ముగుస్తారు. ఇదేవిధంగా రెండవ వైపువారు కూడా ఆడుతారు.
ఇట్లా అడేటపుడు ఒక్కోసారి ఎవరి ఎదురుగా ఉన్న వామనగుంటల్లో 4 గింజలు కూడుతాయి. అట్లా నాలుగు గింజలున్న గుంటను ‘ఆవు’అని చెప్పి ఆ నాలుగు గింజలను దాని ఎదురుగా ఉన్న గుంటలోని గింజలు కూడా తీసుకొంటారు. ఇలా ఆడేటపుడు వామనగుంటలు పూర్తిగా ఖాళీ అయిపోతాయి. అపుడు ఆట అయిపోయినట్టు. తిరిగి ఎవరి గెలుచుకున్న గింజలను వారి వైపున్న వామన గుంటల్లో పోసి మళ్లీ తిరిగి ఆట మొదలు పెడుతారు.
కాకపోతే ఒకరికి గింజలు ఎక్కువగాను, రెండవ వారికి తక్కువగాను వస్తాయి. కనుక వామనగుంటలు పదమూడు లెక్కన పోసేటపుడు కొన్ని ఖాళీగుంటలు మిగులుతాయి. అట్లా రెండవ వైపు వామనగుంటలు కూడా పక్కవారి నింపగలిగినన్ని ఉంటే వారు గెలిచినట్టు అవుతుంది. ఇలా అన్నీ గుంటలు ఒక్కరికే వచ్చేస్తే ఆ వామనగుంటలాట అయిపోయినట్టు.
ఈ ఆట ఆడేటపుడు మంచి రసపట్టుగా ఆసక్తికరంగా సాగుతుంది. అందరూ ఈ ఆటను ఆడడానికి ఆసక్తిని చూపుతారు.

-జంగం శ్రీనివాసులు