S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/15/2017 - 22:29

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642

03/15/2017 - 22:25

ఒక వ్యక్తి మరణశయ్యపై ఉన్నాడు. కుటుంబం, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు అందరూ మనసులో మెదిలారు. అనునిత్యం తనని కలిసే మిత్రులు, కళకళలాడే ప్రపంచం అన్నీ కళ్లలో మెదిలాయి. కానీ తను మరణించబోతున్నానన్న విషయం అతనికి తెలిసిపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి.

03/11/2017 - 21:15

నడక ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా నడుస్తూ ఎంతోమందిని పరిశీలించవచ్చు. వాళ్ల వేషధారణలు, హావభావాలని గమనించవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదు. మనుషులకన్నా వాహనాలు ఎక్కువై పోయాయి. ఓ ఊరేగింపులో నడుస్తున్నట్టు వాహన ప్రయాణం మారిపోయింది నగరాల్లో.

03/06/2017 - 23:03

నా చిన్నప్పుడు మా వూర్లో ఒకే ఒక టెలిఫోన్ వుండేది. అది పోస్ట్ఫాస్‌లో. పోస్ట్ఫాసు మా బాపు దవాఖానాకి ఎదురుగా వుండేది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి టెలిఫోన్ని చూసేవాన్ని. నాకు చాలా ఆశ్చర్యంగా అన్పించేది. మా బాపు కూడా ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో వున్న మా అక్కతో మాట్లాడేవాడు. నాకూ మాట్లాడాలని అనిపించేది. కానీ ఆ అవకాశం చిక్కేది కాదు. ఎందుకంటే అప్పుడు టెలిఫోన్‌లో మాట్లాడటం చాలా ఖరీదుగా వుండేది.

03/04/2017 - 23:51

సెలవులకో, పని మీదో చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్ రిసార్ట్స్‌కు వెళితే అక్కడ మనకొక శిల్పం కనిపిస్తుంది. రాజరిక దుస్తుల్లో నిల్చున్న ఒక చక్రవర్తి శిల్పం మనకి కనిపిస్తుంది. అయితే సరిగ్గా సాయంత్రం కాగానే ఆ శిల్పం అదృశ్యమైపోతుంది. మళ్లీ మర్నాడు ఉదయం అక్కడ అదే భంగిమలో ప్రత్యక్షమవుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ... అవును నిజమే ఉదయం నుండి అలా కదలకుండా నిల్చుని ఉన్న శిల్పం సాయంత్రం కాగానే మాయమైపోతుంది.

03/04/2017 - 23:08

మర్నాడు తెల్లవారుఝామున జనకుడి చేత చేయించాల్సిన యజ్ఞ విధులని మహర్షులు చేయించాక ఆయన గౌతముడి కొడుకు, తన పురోహితుడైన శతానందుడితో ఇలా చెప్పాడు.
‘సరయూ నదీ తీరంలో, చుట్టూ నీటి ఉసిరి చెట్లు గల పుష్పక విమానం లాంటి, పరిశుద్ధమైన సాంకాశ్వ నగరంలో ధార్మికుడైన నా తమ్ముడు ఉన్నాడు యజ్ఞ సంభారాలని సమకూర్చడంలో అతను నాకు సహాయం చేశాడు. ఈ పెళ్లికి అతను వస్తే నాకు ఆనందం’

03/04/2017 - 23:00

ఏ మనిషైనా తాను ఏ రంగంలో రాణించగలడో తెలుసుకుంటే అతనే ప్రపంచం కీర్తించే స్థాయికి ఎదుగుతాడనేందుకు ఎన్నో ఉదాహరణ లున్నాయ. దురదృష్టవశాత్తు ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారు తమ గొప్పదనం ఏమిటో గుర్తెరగలేరు. అయితే తానేమిటో, తన టాలెంట్ ఏమిటో చిన్ననాటి నుండి గుర్తించగలిగిన ఒక యువకుడు నేడు అన్ని చోట్లా కీర్తింపబడుతూ ఖ్యాతి గడించాడు. అతనే పంజాబ్‌లోని లుథియానాకు చెందిన జస్ప్రీత్ సింగ్ కల్రా.

03/04/2017 - 22:56

దండకారణ్యానికి రాజు హిరణ్య అనే మృగరాజు. ఆ అడవిలో అనేక జంతువులూ, పక్షులు నివసిస్తున్నాయి. మృగరాజు తనకు ఆకలి అయినపుడు విచక్షణా జ్ఞానం లేకుండా ఎదురుగా కనిపించిన జంతువును చంపి తినేస్తుంటాడు. అది తెలిసి జంతువులు మృగరాజు ఎదురు పడకుండా చాలా జాగ్రత్తగా సంచరిస్తూ ఉంటాయి.

03/04/2017 - 22:08

వాళ్లంతా కాలేజీ విద్యార్థులు. టాయిలెట్లు ఎలా నిర్మించాలో అవగాహన లేనివాళ్లు. అయితేనేం ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ ఓ టాయిలెట్ నిర్మించాలనే ఆలోచన మాత్రం ఉన్నవాళ్లు. ఆ గ్రామస్థులకు బహిరంగ ప్రదేశాలే మలమూత్ర విసర్జనకు దిక్కు. ఏ ఒక్క ఇంట్లోనూ టాయిలెట్ లేదు. సూర్యోదయానికి ముందో, చీకటి పడిన తర్వాతో మహిళలు, బాలికలు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి.

03/04/2017 - 22:07

బీరు సాన్నిథ్యంలో పదేళ్లు గడిపి జ్ఞానోదయం పొందిన ఇబ్రహీం తన దేశమయిన బొఖారో తిరిగి వెళ్లాడు. కానీ తన నగరానికి వెళ్లలేదు. రాజ్య భారాన్ని నెత్తికెత్తుకోలేదు. దేశంలోనే ఉంటూ అజ్ఞాత జీవితం గడిపాడు. నిరుపేదగా జీవించాడు.

Pages