AADIVAVRAM - Others

సూట్‌కేసు ( కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి మరణశయ్యపై ఉన్నాడు. కుటుంబం, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు అందరూ మనసులో మెదిలారు. అనునిత్యం తనని కలిసే మిత్రులు, కళకళలాడే ప్రపంచం అన్నీ కళ్లలో మెదిలాయి. కానీ తను మరణించబోతున్నానన్న విషయం అతనికి తెలిసిపోయింది. కళ్లలో నీళ్లు తిరిగాయి.
అంతలో లీలగా ఎవరో తనని సమీపిస్తున్నట్టు అనిపించింది. చూస్తే దేవుడు. చిత్రమేమిటంటే దేవుడి చేతిలో ఒక సూట్‌కేసు కనిపించింది. దేవుడి సూట్‌కేస్ చూసి అతను ఆశ్చర్యపోయాడు. అంతలో దేవుడు అతన్ని సమీపించి ‘నాయనా! నీకు సమయం సమీపించింది. ఇక వెళదామా?’ అన్నాడు.
మనిషి సహజ లక్షణంగా అతను ‘స్వామీ! నాకు చాలా ప్లాన్లు ఉన్నాయి. ఇంత తొందరగా వెళ్లడానికి మనస్కరించడం లేదు’ అన్నాడు.
‘అది వీలు కాదు బాబూ! సిద్ధపడు’ అన్నాడు దేవుడు.
మనిషి ఉత్సుకతతో ‘స్వామీ! మీ సూట్‌కేసులో ఏమున్నాయి?’ అన్నాడు.
దేవుడు ‘అందులో నీకు సంబంధించినవన్నీ ఉన్నాయి’ అన్నాడు. దాంతో ఆ వ్యక్తికి మరింత ఆతృత కలిగింది. ‘నాకు సంబంధించినవా? ఆశ్చర్యంగా ఉందే. బహుశా నా డబ్బు, బట్టలు అనుకుంటాను’ అన్నాడు.
దేవుడు ‘అవి నీకు సంబంధించినవి కావు. అవి భూమికి సంబంధించినవి’ అన్నాడు.
ఆ వ్యక్తి ‘లేకుంటే అవి నా జ్ఞాపకాలా?’
‘అవి నీవి కాదు, అవి కాలానికి సంబంధించినవి’
‘లేకుంటే నా నైపుణ్యాలా?’
‘అవి నీ పరిసరాలకు సంబంధించినవి’
‘మరి నా స్నేహితులు, కుటుంబం’
‘వాళ్లు నీవాళ్లు కారు, దారిలో తటస్థించిన వాళ్లు’
‘నా భార్యా కొడుకు?’
‘వాళ్లు నీ వాళ్లు కాదు. నీ హృదయానికి సంబంధించిన వాళ్లు’
‘లేకుంటే నా శరీరం?’
‘అది నీది కాదు. ధూళికి సంబంధించినది’
‘ఐతే మరి నా ఆత్మ?’
‘అది నీది కాదు. అది నాది’
అతను అయోమయంలో మునిగాడు. దేవుడు సూట్‌కేసు తీసి చూపాడు. అది ఖాళీగా ఉంది. ఆ వ్యక్తి కన్నీళ్లు పెట్టుకుని ‘నాదంటూ ఏమీ లేదా?’ అన్నాడు. దేవుడు ‘అవును నిజం. నువ్వు జీవించిన క్షణం మాత్రమే నీది. జీవితం క్షణ క్షణం, క్షణికం. అందువల్లే నీకు అందిన క్షణాన్ని ఆనందించు. ప్రపంచంలో ఉన్నదేదీ నీది కాదు. ‘ఇప్పుడు జీవించు. జీవితాన్ని జీవించు. సంతోషంగా ఉండటం మరచిపోవద్దు. తెలుసుకోవాల్సిన విషయమదొక్కటే’
నువ్వు ఇక్కడ వున్న భౌతిక విషయాల్ని మరచినపుడే అక్కడికి రాగలవు.
ఎందుకంటే దేన్నీ నువ్వు తీసుకుపోలేవు’ అన్నాడు.
*

- సౌభాగ్య, 9848157909